Russia: శక్తివంతమైన క్షిపణని ప్రయోగించిన రష్యా

Russia: బారెంట్స్‌ సముద్రంలో యుద్ధ నౌక నుంచి ప్రయోగం

Update: 2022-05-29 11:49 GMT

Russia: శక్తివంతమైన క్షిపణని ప్రయోగించిన రష్యా

Russia: ఉక్రెయిన్-రష్యా యుద్ధం భీకరంగా సాగుతోంది. మరోవైపు ఉక్రెయిన్‌కు అమెరికా, ఐరోపా సమాఖ్య సహా పాశ్చాత్య దేశాలు అండగా నిలుస్తున్నాయి. భారీగా ఆయుధాలను ఇస్తున్నాయి. అయితే వాటికి చెక్‌ పెట్టేందుకు పుతిన్‌ తాజాగా జిర్కాన్ అస్త్రాన్ని ప్రయోగించారు. అత్యంత శక్తివంతమైన జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి పరీక్షను విజయవంతంగా ప్రయోగించినట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. మెరుపులా దూసుకెళ్లే ఈ క్షపణిని శత్రుదేశ రాడర్లు కూడా పసిగట్టలేవని రష్యా చెబుతోంది. ఎంచుకున్న లక్ష్యాన్ని ఇది అవోకగా దాడి చేయగలదని మాస్కో చెబుతోంది. యుద్ధం మొదలైన తరువాత రష్యా చేపట్టిన రెండో క్షిపణి ప్రయోగం ఇదే.

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించింది. నూరు రోజులకు చేరువవుతున్న యుద్ధం మరింత భీకరంగా సాగుతోంది. ఈ యుద్దంలో ఉక్రెయిన్‌కు అమెరికా, ఐరోపా సమాఖ్య సహా పాశ్చాత్య దేశాలు భారీగా ఆయుధ, ఆర్థిక సాయం అందిస్తున్నాయి. కీవ్‌కు అండగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వొద్దంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినా అమెరికా మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా కూడా 40 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భారీగా అత్యాధునిక ఆయుధాలను అంధించనున్నది. పాశ్చాత్య దేశాల చర్చలతో ఆగ్రహంగా ఉన్న పుతిన్‌.. అమెరికా, ఐరోపా దేశాలకు కీలక హెచ్చరికలు పంపారు. తమ ఆయుధ సత్తా ఏమిటో క్షిపణిని పరీక్షించి అమెరికాకు బెదిరింపు సంకేతాలు పంపారు., తాజాగా ధ్వని వేగం కన్నా 9 రెట్లు వేగంగా దూసుకెళ్లే శక్తివంతమైన జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణని విజయవంతంగా ప్రయోగించారు. బాలిస్టిక్‌ క్షిపణుల్లో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగమైవంతమైనదిగా నిపుణులు చెబుతున్నారు.

జిర్కాన్‌ గంటకు 11వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ మిస్సైల్‌ వెయ్యి కిలోమీటర్ల దూరంలో తెల్ల సముద్రంలోని లక్ష్యాన్ని విజయవంతంగా చేధించినట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. దీన్ని బారెంట్స్‌ సముంద్రంలోని అడ్మిరల్ గోర్షోవ్‌ ఫ్రిగేట్‌ యుద్ధ నౌక నుంచి ప్రయోగించినట్టు మాస్కో తెలిపింది. జిర్కాన్‌ శత్రుదేశ రాడర్లకు టొకరా ఇస్తాయని స్పష్టం చేసింది. రాడర్ల నుంచి వచ్చే రేడియో తరంగాలను ఇది శోషించుకుంటుంది. ఫలితంగా రాడర్లు జిర్కాన్‌ను కనిపెట్టలేవని వివరించింది. ఇక ఈ క్షిపణిలో వాడిని అప్‌గ్రేడెడ్‌ ఇంధనంతో మెరుపులా దూసుకెళ్తనున్నది. అత్యధిక వేగం కారణంగా జిర్కాన్‌ ముందు భాగంలోని వాయుపీడనం.. క్షిపణి చుట్టూ ప్లాస్మా మేఘాన్ని ఏర్పరనున్నట్టు రష్యా వెల్లడింది. దీంతో ఈ క్షిపణిని శత్రు దేశాలు కనిపెట్టి.. మరో అస్త్రంతో కూల్చడం అసాధ్యమని క్రెమ్లిన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

అమెరికా యుద్ధ విమానాలే లక్ష్యంగానే జిర్కాన్‌ను రూపొందించినట్టు నిపుణులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన ఏజిస్‌ క్షిపణి రక్షణ వ్యవస్థకు శత్రు అస్త్రాలను నేలకూల్చడానికి 8 నుంచి 10 సెకన్లు పడుతుంది. ఇంత స్వల్ప వ్యవధిలోనే జిర్కాన్‌ 20 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీంతో ఇది అమెరికా క్షిపణులకు కూడా చిక్కదంటున్నారు. ఒకవేళ 100 మైళ్ల దూరంలోనే అమెరికా ఈ క్షిపణిని గుర్తించినా.. స్పందించి దాడి చేయడానికి నిమిషమే ఉంటుందని.. ఆలోపు జిర్కాన్‌ లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుందంటున్నారు. జిర్కాన్‌ ప్రధానంగా సముద్రం, నేలపైనున్న లక్ష్యాలను ఛేదించగలదు. విమాన వాహక, యుద్ధ నౌకలు, జలాంతర్గాముల్లో మోహరించగలిగేలా దీన్ని తీర్చిదిద్దారు. కదిలే, సమూహంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. దీన్ని అత్యంత అద్భతమైన అస్త్రంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ అభివర్ణించారు.

ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత రష్యా రెండోసారి క్షిపణులను ప్రయోగాలను నిర్వహించింది. ఉక్రెయిన్‌ ఆక్రమణలో భాగంగా.. రష్యా తన అమ్ములపొదిలోని భీకర అస్త్రాన్ని మార్చి 18న ప్రయోగించింది. ఇది అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత ఇష్టమైన క్షిపణి. ఇవానో-ఫ్రాంకివ్‌స్కీలో నేలమాళిగలోని భారీ ఆయుధగారాన్ని ధ్వంసం చేసింది. మరోవైపు ఈ దాడితో ఐరోపా సభ్య దేశాల్లో వణుకు మొదలయ్యింది. కింజాల్‌ మిస్సైల్‌తో ధ్వంసమైన నేలమాళిగ.. రొమేనియా సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కింజాల్‌ అంటే రష్యన్‌ భాషలో పిడి బాకు అని అర్థం. ఇది యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే హైపర్‌సోనిక్‌ క్షిపణి. ప్రయోగించిన వెంటనే ఇది 4వేల 900 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అనంతరం గరిష్టంగా 12వేల 350 కిలోమీటర్ల వేగాన్ని సాధిస్తుంది. 480 కిలోల అణు బాంబులను మోసుకెళ్లగలదు. దీని తరువాత తాజాగా జిర్కాన్‌ను రష్యా ప్రయోగించింది. తాజాగా హైపర్‌సోనిక్‌ మిస్సైల్‌ను ప్రయోగించడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అమెరికా గట్టి హెచ్చరికలు ఇచ్చినట్టేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Tags:    

Similar News