ఉక్రెయిన్ లోని ఆస్పత్రులపై బాంబుల వర్షం.. క్రూరత్వానికి పరాకాష్టగా...

Russia - Ukraine War: 15 రోజులకు చేరిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం...

Update: 2022-03-10 02:15 GMT

ఉక్రెయిన్ లోని ఆస్పత్రులపై బాంబుల వర్షం.. క్రూరత్వానాకి పరాకాష్టగా...

Russia - Ukraine War: ఉక్రెయిన్ పై సైనిక చర్య పేరిట 15 రోజులుగా దాడులకు తెగబడుతున్న రష్యా మరింత రెచ్చిపోయింది. ఆస్పత్రులపై బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో పలు హాస్పిటల్స్ తునాతునకలయ్యాయి. దీన్ని ఖండించిన జెలెస్కీ.. రష్యా చర్యలను క్రూరత్వానికి పరాకాష్టగా అభివర్ణించారు. ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలను ఎంతకాలం భరిస్తామంటూ ప్రపంచ దేశాలను ప్రశ్నించారు. తమ గగనతలాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని పశ్చిమ దేశాలకు మరోసారి విజ్నప్తి చేశారు.

కీవ్ లోని జనావాసాలపైనా పుతిన్ సేనలు క్షిపణులు, రాకెట్ దాడులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో నగరంలోని పలు భవంతులు, వంతెనలు కుప్పకూలిపోతున్నాయి. ఇక ప్రపంచంలో రష్యాను ఏకాకిగా నిలిపేందుకు అమెరికా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోయిందని బైడెన్ విమర్శించారు. అంతేకాదు.. రష్యా కరెన్సీ రూబెల్ విలువ ఏకంగా 50 శాతానికి పైగా పతనమైందని గుర్తు చేశారు.

ఇక సుమీ నుంచి పోల్తావా చేరుకొన్న 600 మంది భారతీయులు పోలాండ్ నుంచి నేడు భారత్ కు ప్రయాణం కానున్నారు. భారత ఎంబసీ రక్షించిన 17 మంది విదేశీయుల్లో ఒక పాకిస్తానీ యువతి కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు 21 లక్షల మంది వలస వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ వెల్లడించింది.

Tags:    

Similar News