Russia - Ukraine War: కీలక మలుపు తిరుగుతున్న ఉక్రెయిన్-రష్యా వార్.. జీవాయుధాలను...

Russia - Ukraine War: ఉక్రెయిన్ ల్యాబ్‌ల్లో జీవాయుధాలను అమెరికా తయారుచేస్తుందని రష్యా ఆరోపణ

Update: 2022-03-11 04:15 GMT

Russia - Ukraine War: కీలక మలుపు తిరుగుతున్న ఉక్రెయిన్-రష్యా వార్.. జీవాయుధాలను...

Russia - Ukraine War: ఉక్రెయిన్-రష్యా వార్ కీలక మలుపు తిరిగుతోంది. ఉక్రెయిన్‌లో రసాయన, జీవాయుధాల అభివృద్ధి జరుగుతోందని రష్యా బహిరంగంగా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌ భూభాగంలోని ల్యాబోరేటరీల్లో రసాయన, జీవాయుధాలలకు సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయని రష్యా ఆరోపిస్తోంది. అంతేకాదు..ఉక్రెయిన్‌ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటుందని..దాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని రష్యా చెప్తోంది. జీవాయుధాల తయారీ వెనుకాల అమెరికా హస్తం ఉందని రష్యా ఆరోపిస్తోంది.

అయితే రష్యా ఆరోపణలను అమెరికా శ్వేతసౌధం అధికారులు ఖండించారు. ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధాన్ని సమర్థించుకోవడానికే ఇలాంటి వాదనను రష్యా తెరపైకి తెస్తోందని అమెరికా స్పష్టం చేస్తోంది. రష్యా ఆరోపణల వెనుక చైనా మద్దతు కూడా ఉన్నట్లు సంకేతాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

రెండు వారాలుగా జరుగుతున్న యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకే రష్యా జీవాయుధాల తయారీ వంటి ఆరోపణలను తెరమీదకు తెస్తోందని అమెరికా చెప్తోంది. ఉక్రెయిన్ దళాల నుంచి ఊహించిన దానికంట గట్టిగా ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో రష్యా ఈ మార్గాన్ని ఎంచుకుందని అమెరికా చెప్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా జోక్యంపై యూఎన్ భద్రతా మండలిలో నేడు చర్చించాలని రష్యా డిమాండ్ చేస్తోంది. అయితే రష్యా చేస్తున్న ఈ డిమాండ్‌పై భద్రతా మండలిలో చర్చ జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News