NASA: అంగారక అన్వేషణలో ఊహకందని విషయాలు
NASA: భయంగొలిపే శబ్దాలను భూమికి పంపిన రోవర్ * అంగారక శబ్దాలపై సంచలన ప్రకటన చేసిన నాసా
NASA: అంగారక అన్వేషణలో ఊహకందని విషయాలు, అవశేషాలు బయటపడుతున్నాయి. అంగారక గ్రహంపై జీవుల మనుగడ, నీటి ఆనవాళ్ల కోసం నాసా పంపిన రోవర్ భయంగొలిపే శబ్దాలను భూమికి పంపింది. అంగారక గ్రహం నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించిన నాసా సంచలన ప్రకటన చేసింది.
అంగారకుడిపై నీటి ఆనవాళ్లు, జీవుల మనుగడ ఉందో లేదో తెలుసుకోవడానికి, వాటి అవశేషాలను వెలికి తీయడానికి నాసా ప్రయోగించిన పర్సెవరెన్స్ రోవర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ గ్రహంపై ల్యాండైంది. అంగారకుడిపై కాలుమోపే సమయంలో ఉత్పన్నమయ్యే శబ్దాలను రికార్డు చేయడానికి రెండు మైక్రోఫోన్లను రోవర్‌లో ఏర్పాటు చేశారు. అయితే, ల్యాండింగ్ సమయంలో అది పనిచేయలేదు. కానీ, అంగారకుడిపై రోవర్ కదిలే సమయంలో వెలువడిన ధ్వనులను మాత్రం పర్సెవరెన్స్ నమోదు చేసింది. మైక్రోఫోన్లలో ఒకటి అక్కడి గాలి శబ్దాన్ని, రాళ్లపైకి లేజర్లను ప్రయోగించినప్పుడు వెలువడిన ధ్వనులను రికార్డు చేసింది. అయితే, అంగారకుడిపై వెలువడుతోన్న శబ్దాలు కర్ణకఠోరంగా ఉన్నట్లు అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా గుర్తించింది.
అంగారక గ్రహంపై తన కదలికలకు సంబంధించిన ధ్వనులను అమెరికా రోవర్ 'పర్సెవరెన్స్' భూమికి పంపింది. అందులో పిండిమర శబ్దం, తీవ్రమైన కీచు ధ్వని, కర్ణకఠోరమైన పెద్ద శబ్దం వంటివి ఉన్నాయి. పర్సెవరెన్స్‌ను రెండు వారాల కిందట అంగారకుడిపై తొలిసారిగా నడిపారు. రోవర్‌లోని ఆరు లోహపు చక్రాలు, సస్పెన్షన్ వ్యవస్థ నుంచి వెలువడిన ధ్వనులను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విడుదల చేసింది. అయితే, భూమి మీద ప్రమాణాలతో పోలిస్తే అవి చాలా ఆందోళనకర శబ్దాలని రోవర్ నుంచి వెలువడిన సౌండ్స్ కర్ణకఠోరంగా, భయకరంగా ఉన్నాయని తెలిపింది.