Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో రెచ్చిపోయిన తాలిబన్లు

Afghanistan: కాందహార్‌ విమానాశ్రయంపై రాకెట్ల దాడి * మూడు రాకెట్లతో విరుచుకుపడ్డ తాలిబన్లు

Update: 2021-08-01 14:15 GMT

కాందహార్ విమానాశ్రయం పై రాకెట్ల దాడి (ఫైల్ ఇమేజ్)

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. అమెరికా దళాలు వెనుదిరుగుతున్న వేళ.. తాలిబన్లు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా దక్షిణ ఆఫ్ఘనిస్తాలోని కాందహార్‌ విమానాశ్రయంపై తాలిబాన్లు మూడురాకెట్లతో దాడులకు పాల్పడ్డారు. రెండు రాకెట్లు ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై పడడంతో ధ్వంసమైంది. దీంతో విమానాశ్రయం నుంచి అన్ని విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు. రన్‌వే మరమ్మతులు జరుగుతున్నాయని, త్వరలోనే విమానాశ్రయం పని చేస్తుందన్నారు. అయితే, రాకెట్‌ దాడిని కాబూల్‌లోని ఏవియేషన్‌ అథారిటీ ధ్రువీకరించింది. గత కొన్ని వారాలుగా తాలిబాన్లు కాందహార్‌ శివారుల్లో దాడులు జరుపుతున్నారు.

మరోవైపు.. ఆఫ్ఘనిస్తాన్‌లో కాందహార్‌ రెండో పెద్ద నగరం కాగా.. ఆ దేశానికి లాజిస్టిక్స్‌, ఎయిర్‌ సపోర్ట్‌ అందించడంలో ఈ ఎయిర్‌ బేస్‌ కీలకమైంది. పశ్చిమాన హెరాత్, దక్షిణాన లష్కర్‌ గాహ్‌ రెండు ఇతర ప్రాంతీయ రాజధానులను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా బలగాల ఉపసంహరణ చివరి దశలో.. ఇటీవలి వారాల్లో తాలిబాన్లు ప్రావిన్స్‌ రాజధానులపై కన్నేశారు. అలాగే కీలక సరిహద్దులను స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘానిస్తాన్‌లో ఎక్కడ చూసినా దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

Tags:    

Similar News