Rishi Sunak: ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే ప్రధాన అజెండా..
Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా నియమితులైన సందర్భంగా రిషి సునాక్ తొలి ప్రసంగం చేశారు.
Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా నియమితులైన సందర్భంగా రిషి సునాక్ తొలి ప్రసంగం చేశారు. ప్రస్తుతం దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బ్రిటన్ దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్న ఆయన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లపైనా ప్రభావం చూపుతోందని స్పష్టం చేశారు. ఇక మాజీ ప్రధాని లిజ్ ట్రస్ దేశ ఆర్థిక లక్ష్యాలను సాధించడం కోసం పనిచేయడం తప్పుకాదన్న రిషీ కొన్ని పొరపాట్లు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. వాటిని సరిచేసేందుకే తనకు బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు.
ఇక ముందు ప్రతి విషయంలోనూ జవాబుదారీతనంతో వ్యవహరిస్తామన్నారు. అయితే ఇది మాటలతో కాకుండా చేతల్లో చూపిస్తామన్నారు. ప్రస్తుతం కొన్ని క్లిష్టమైన నిర్ణయాలతో బ్రిటన్ ఎదుర్కొంటోన్న సవాళ్లను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందిని చెప్పారు. దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చిన రిషీ యూకే ప్రజల ఉన్నతి కోసం రాత్రింబవళ్లు శ్రమించి పనిచేస్తానన్నారు.