Rishi Sunak: పోటీకి అర్హత సాధించిన రిషి.. హుటాహుటిన యూకేకు బోరిస్‌..

Rishi Sunak: ప్రధాని లిజ్‌ ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే.

Update: 2022-10-22 14:47 GMT

Rishi Sunak: పోటీకి అర్హత సాధించిన రిషి.. హుటాహుటిన యూకేకు బోరిస్‌..

Rishi Sunak: ప్రధాని లిజ్‌ ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా తర్వాత జరిగిన కన్జర్వేటివ్‌ పార్టీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌పై విజయం సాధించిన లిజ్‌ ట్రస్‌ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అయితే, తన విధానాలతో అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురవడంతో అధికారం చేపట్టిన 45 రోజులకే అనూహ్యంగా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ట్రస్‌ రాజీనామాతో రిషి సునాక్‌ మరోసారి ప్రధాని రేసులో నిలిచారు. ప్రధాని అయ్యేందుకు కావాల్సిన అర్హతలను అందుకున్నారు.

ఇప్పటికే ఆయనకు వంద మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు. అయితే, మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మరోసారి ఆ పోస్టుపై కన్నేసినట్లు తెలుస్తోంది. కరీబియన్‌ దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్న బోరిస్‌.. హుటాహుటిన మళ్లీ బ్రిటన్‌కు బయలుదేరారు. ప్రధాని రేసునుంచి తప్పుకోవాలంటూ రిషి సునాక్‌ను కోరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే ‎ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్‌కు వంద మంది ఎంపీలు మద్దతిస్తుండగా.., బోరిస్‌ జాన్సన్‌కు 44 మంది, పెన్నీ మోర్డాంట్‌కు 21 మంది మద్దతు ఉంది. అలా ఈ ముగ్గురిలో రిషి సునాక్‌కు ఎక్కువ మంది మద్దతు లభించడంతో ఆయన బ్రిటన్ ప్రధాని రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News