Omicron Variant: వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్
Omicron Variant: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్
Omicron Variant: కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం పూర్తిగా కోలుకోక ముందే.. తాజాగా నయా వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ అంతకంతకు పెరుగుతోంది. ఒమిక్రాన్ తో రిస్క్ చాలా తీవ్ర స్థాయిలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వేరియంట్ తో పెను ప్రమాదం పొంచి ఉన్నట్లు చెబుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ హెచ్చ స్థాయిలో ప్రబలితే ..దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాని డబ్ల్యూహెచ్ ఓ టెక్నికల్ నోట్ లో తెలిపింది.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 115 కేసులు నమోదయ్యినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బోట్స్ వానాలో రెండు, ఇంగ్లండ్ లో రెండు, హాంకాంగ్ లో రెండు, ఆస్ట్రేలియాలో రెండు కేసులు నమోదు కాగా..ఇటలీ, ఇజ్రాయెల్ , బెల్జియం, చెక్ రిపబ్లక్ లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదయ్యింది. అయితే మరణాలు మాత్రం రికార్డు కాలేదు. అయినప్పటికీ పలు దేశాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. యూకే, యూరప్, యూఎస్, ఆస్ట్రేలియాలో కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో వివిద దేశాలు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి.
ఒమిక్రాన్ మ్యుటెషన్లు ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు సుమారు 26 నుంచి 32 వరకు స్పైక్ ప్రొటీన్లు పరివర్తనం చెందుతున్నట్లుగా గుర్తించారు. దీని వల్ల ఇమ్యూనిటీకి ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వ్యాప్తి కూడా ఎక్కువ రేంజ్ ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు. తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలు సైతం కొత్త వేరియంట్ పై అప్రమత్తం అయ్యాయి. కొద్దిసేపటి క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చించగా ఏపీలోనూ కొవిడ్ టాస్క్ ఫోర్స్ టీం సమావేశమై ఒమిక్రాన్ పై చర్చించారు.