Putin: పుతిన్‌ బతికేది మరో మూడేళ్లే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో మూడేళ్లలో చనిపోతారట పాశ్చాత్య మీడియా మరో కథనంతో వార్తల్లో పుతిన్‌ను నిలిపింది.

Update: 2022-05-30 13:30 GMT

Putin: పుతిన్‌ బతికేది మరో మూడేళ్లే..

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో మూడేళ్లలో చనిపోతారట పాశ్చాత్య మీడియా మరో కథనంతో వార్తల్లో పుతిన్‌ను నిలిపింది. ఫెడరల్ సెక్యురిటీ సర్వీస్ అధికారి ప్రకటన ఆధారంగా మరోసారి కథనాన్ని వండివార్చింది. పుతిన్ క్యాన్సర్‌తో ఇబ్బందులు పడుతున్నారని మరో మూడేళ్లే ఆయన బతుకుతారంటూ సంచలన కథనం విడుదల చేసింది. పుతిన్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోందని కంటి చూపు సమస్య వస్తోందని పేర్కొంది. అందుకే పుతిన్ కు ఇచ్చే స్పీచ్ తాటికాయంత లెటర్స్‌తో రాసి ఇస్తున్నారన్నారంది. కళ్లజోడు ధరించడానికి పుతిన్ అంగీకరించడం లేదంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఇక చాన్నాళ్లుగా పుతిన్ కు మతమరుపు పెరిగిందన్న వార్తలు వస్తూనే ఉన్నాయ్. చేతులు, కాళ్లు కూడా వణుకుతున్నాయన్న వర్షన్ విన్పిస్తున్నాయ్. కన్పించిన వారందరిపైనా పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటున్నారు.

పుతిన్ అనారోగ్యంగా ఉన్నారన్న మాట పచ్చి అబద్ధమన్నారు రష్యా విదేశాంగ మంత్రి సెర్గివ్ లావ్రోవ్. పుతిన్ కు ఎలాంటి సమస్య లేదని ఆయన తేల్చిచెప్పారు. పుతిన్ ఆరోగ్య విషయాలను పబ్లిక్ లో చెప్పాల్సిన అవసరం లేదని అవన్నీ వ్యక్తిగతమన్నారు లావ్రోవ్. ఫ్రాన్స్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఆరోగ్య సంబంధించిన విషయాలపై క్లారిటీ ఇచ్చారాయన. తెలివగలవారెవరూ కూడా పుతిన్‌కు అనారోగ్యమని భావించరన్నారు రష్యా విదేశాంగ మంత్రి. ఈ ఏడాది అక్టోబర్‌లో 70వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారని నిత్యం పుతిన్ ప్రజల్లోకి వస్తూనే ఉన్నారన్నారు. కళ్లులేని కబోదులకు మాత్రమే ఇలాంటి విషయాల గురించి పదేపదే చర్చించుకుంటారన్నారు. పుతిన్ ప్రసంగాలు, కథనాలను రెగ్యులర్ గా వీక్షించవచ్చన్నారు. పుతిన్ ఆరోగ్యం బాగాలేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా పుతిన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. 

Tags:    

Similar News