Paris: మోనాలిసా చిత్రంపై సూప్ చల్లి నిరసన
Paris: పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలోని ఘటన
Paris: ఫ్రాన్స్‌లో రైతుల సమస్యలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతుల ఆందోళనలు లౌవ్రే మ్యూజియంలోని మోనాలిసా చిత్రపటానికి చేరాయి. సందర్భంగా ఇద్దరు పర్యావరణ కార్యకర్తలు పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలోని మోనాలిసా చిత్రానికి రక్షణగా ఏర్పాటు చేసిన గాజు పలకపై సూప్ చల్లారు. మన వ్యవసాయ రంగం దుర్భరంగా ఉంది. మన రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు’’ అంటూ నినాదాలు చేసిన కార్యకర్తలు ఈ చర్యకు పాల్పడినట్లు మ్యూజియం సిబ్బంది తెలిపారు.
అప్రమత్తమైన సిబ్బంది మ్యూజియం నుంచి సందర్శకులను ఖాళీ చేయించారు. ఈ ఘటనకు కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సాంకేతిక విధానాలను సరళీకరించాలని, వాహనాలకు డీజిల్ ఇంధన పన్నును రద్దు చేయాలన్న పలు డిమాండ్లతో ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాల్లో రైతులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే లౌవ్రే మ్యూజియంలోకి చొచ్చుకెళ్లిన పర్యావరణ కార్యకర్తలు ఆందోళన చేసినట్లు అధికారులు తెలిపారు.