Nuclear Power Plant: ప్రపంచ దేశాలకు చైనా నుంచి మరో ముప్పు

Nuclear Power Plant: ప్రపంచ దేశాలకు కరోనా వైరస్‌ కంటే డేంజర్‌గా తయారైంది డ్రాగన్ కంట్రీ.

Update: 2021-07-23 14:30 GMT

Nuclear Power Plant: ప్రపంచ దేశాలకు చైనా నుంచి మరో ముప్పు

Nuclear Power Plant: ప్రపంచ దేశాలకు కరోనా వైరస్‌ కంటే డేంజర్‌గా తయారైంది డ్రాగన్ కంట్రీ. కోవిడ్‌ మహమ్మారిని ప్రపంచం మీదికి వదిలిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా మరో పెనుముప్పును గుట్టుగా దాచిపెడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని ఫ్రాన్స్‌కు చెందిన కీలక ప్రతినిధి స్పష్టం చేస్తున్నారు. ఇంతకూ చైనా చేస్తున్న కుట్రలేంటి..? మానవాళికి మరో ముప్పు తప్పదా..?

కోవిడ్ విషయంలో ప్రపంచ దేశాలతో చివాట్లు తింటున్న డ్రాగన్ కంట్రీకి ఇంకా బుద్ధి రాలేదు. మళ్లీ మళ్లీ అదే తీరుతో ఎవరెలాపోతే మాకేంటి అన్నట్లుగానే వ్యవహరిస్తోంది. తాజాగా ఫ్రాన్స్‌కు చేందిన ఓ ప్రతినిధి చైనా చీప్ మెంటాలిటీని బయటపెట్టారు. గయాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని తైషాన్ అణు విద్యుత్ ప్లాంట్ నిర్వహణలో చైనా తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. ఆ ప్లాంట్ నుంచి రేడియేషన్ లీకైనట్లు తేలినా ఇప్పటికీ ప్లాంట్‌ను చైనా కంటిన్యూ చేస్తోందని షాకిచ్చారు.

కొన్ని సంతవత్సరాల క్రితమే ఈ వార్తలు వచ్చినప్పటికీ చైనా మాత్రం అప్పుడు అలాంటిది ఏంలేదని కొట్టిపారేసింది. అయితే, వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి చెప్పలేదని విషయం తాజాగా వెల్లడైంది. ఈ అణువిద్యుత్ ప్లాంట్‌కు ఎలక్ట్రిసిటీ డె ఫ్రాన్స్‌‌కు చెందిన ఫ్రామాటోమ్ కోపార్టనర్‌గా వ్యవహరిస్తున్నారు. రేడియేషన్ లీక్ అంశంలో తాజాగా స్పందించిన సంస్థ ప్రతినిధి భద్రత ప్రమాణాల ప్రకారం తమ చేతిలో అధికారం ఉండిఉంటే ప్లాంట్‌ను ఇప్పటికే క్లోజ్ చేసేవారమని స్పష్టం చేశారు.

అయితే, ప్రస్తుతం అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితి లేకపోయినా సమస్య తీవ్రంగానే ఉన్నట్లు ఫ్రాన్స్‌ ప్రతినిధి తెలిపారు. ప్లాంట్ మూసివేత అంశంలో చైనా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రేడియేషన్ మరింత పెరుగుతోందని ఫ్రామాటోమ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా సాయం కోరుతూ లేఖ రాసింది. దీంతో ఈ మొత్తం వ్యహారం వెలుగులోకి వచ్చింది. కానీ, డ్రాగన్ కంట్రీ మాత్రం షరామామూలుగా అంతా సురక్షితమే అని చెబుతోంది.

మరోవైపు ప్లాంట్‌లో ఉన్న రెండు అణు రియాక్టర్లలో ఒక దానికి ఫ్యూయియల్ రాడ్లు దెబ్బతిన్నట్లు ఈ ఏడాది జూన్‌లోనే కనిపెట్టారు. ఈ రియాక్టర్‌లోని 60వేల ఫ్యూయియల్ రాడ్లలో 5మాత్రమే దెబ్బతిన్నట్లు చైనా అధికారులు చెబుతున్నారు. ఇదేమంత ప్రమాదం కాదన్నది చైనా వాదన. ఇదే సమయంలో రియాక్టర్‌లో వాడే నోబెల్ గ్యాస్‌ల స్థాయి పెరిగినట్లు ఫ్రాన్స్ కంపెనీ చెబుతోంది. ఇవి అణుఇంధన రాడ్లు ధ్వంసమైనప్పుడే వెలువడుతాయని, అనంతరం ప్రమాద తీవ్రత పెరుగుతూ పోతోందని ఫ్రాన్స్‌ కంపెనీ చెబుతోంది. ఏది ఏమైనా ఈ ప్లాంట్ విషయంలో చైనా మేల్కొనకుంటే మరో ముప్పు తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

Tags:    

Similar News