హిస్టారికల్ విక్టరీ.. మరోసారి ప్రధానిగా జసిండా!
New Zealand Elections 2020: న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రధాని జసిండా ఆర్డెర్న్ మరోసారి విజయం సాధించారు. ఆమె సారధ్యంలోని లేబర్ పార్టీ 49 శాతం ఓట్లతో 120 సీట్లకు గాను 64 సీట్లను సాధించింది.
New Zealand Elections 2020: న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రధాని జసిండా ఆర్డెర్న్ మరోసారి విజయం సాధించారు. ఆమె సారధ్యంలోని లేబర్ పార్టీ 49 శాతం ఓట్లతో 120 సీట్లకు గాను 64 సీట్లను సాధించింది. అయితే ఇప్పటివరకూ న్యూజిలాండ్ చరిత్రలో ఒక పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించింది లేదు.. ఇప్పటివరకు అన్ని సంకీర్ణ ప్రభుత్వాలే ఆ దేశాన్ని పాలిస్తూ వచ్చాయి. కోవిడ్ 19ని నియంత్రణకి గాను ఆమె చేసిన కృషినే ఈ విజయానికి కారణమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. 70శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ప్రధాన ప్రత్యర్థి జుడిత్ కాలిన్స్ ఓటమిని అంగీకరించడం గమనార్హం..
ఇక ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీకి 49శాతం ఓట్లు రాగా.. నేషనల్ పార్టీకి 27శాతం ఓట్లు వచ్చినట్టుగా ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక 2017లో జసిండా ఆర్డెర్న్ తొలిసారి ప్రధానిగా ఎన్నికైయ్యారు. తాజాగా మరోసారి విజయం సాధించడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాబోయే మూడేళ్ళలో తానూ చేయాల్సింది చాలా ఉందని ఆమె అన్నారు. తనపైన నమ్మకం ఉంచిన న్యూజిలాండ్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం న్యూజిలాండ్ లో సెప్టెంబర్19నే ఎన్నికలు జరగాలి కానీ కరోనా వలన వాయిదా పడింది.