జి7 శిఖరాగ్ర సమావేశం వాయిదా : డోనాల్డ్ ట్రంప్
జూన్ చివరలో నిర్వహించాలనుకుంటున్న గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
జూన్ చివరలో నిర్వహించాలనుకుంటున్న గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుండి వాషింగ్టన్ కు తిరిగి వచ్చిన ట్రంప్.. ఎయిర్ ఫోర్స్ వన్లో విలేకరులతో మాట్లాడారు.. ఈ సందర్బంగా ట్రంప్, ప్రస్తుత ఫార్మాట్లో ఉన్న జి 7 "చాలా పాత దేశాల సమూహం" అని సంబోధించారు. అలాగే ఈ ఏడాది జరగాల్సిన G7 సమావేశాన్ని సెప్టెంబర్ వరకూ వాయిదా వేస్తున్నాను.. G7 ప్రపంచంలో ఏమి జరుగుతుందో సరిగ్గా సూచిస్తుందని ట్రంప్ అన్నారు.
కాగా G7 లో యునైటెడ్ స్టేట్స్, ఇటలీ, జపాన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ మరియు యూరోపియన్ యూనియన్లతో రూపొందించబడింది. ఈ దేశాల్లో ప్రస్తుతం కరోనా కేసులు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే ఈసారి జరగాల్సిన సమావేశంలో G7 దేశాల జాబితాను విస్తరించాలని.. ఆస్ట్రేలియా, రష్యా, దక్షిణ కొరియా, భారతదేశాలను ఆహ్వానించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు.
HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి