Pfizer: చిన్నారుల కోసం రెడీ అవుతున్న కోవిడ్ వ్యాక్సిన్
Pfizer: చిన్నారులకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ రెడీ అయింది.
Pfizer: చిన్నారులకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ రెడీ అయింది. తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా చిన్నారులకూ సురక్షితమేనని అమెరికాలోని ఫైజర్ ఫార్మా ప్రకటించింది. ఇదేవిధంగా టీకాను తయారు చేసిన ఇంకొన్ని కంపెనీలు కూడా చిన్నారులను వైరస్ నుంచి కాపాడేందుకు తమ టీకాలు సురక్షితమని చెబుతున్నాయి. ఆరు నెలల చిన్నారులపై కూడా సమర్థవంతంగా పనిచేస్తాయని అంటున్నాయి. చిన్నారులు కరోనా బారిన పడితే అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుందని, అందుకే వారికి టీకాలు వేయడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.