మెదడుపై కూడా ప్రభావం చూపుతున్న కరోనా

Update: 2020-12-12 13:45 GMT

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతుంది. కొన్ని దేశాల్లో కేసులు తగ్గినప్పటికీ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడా వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. మరోవైపు కరోనా వచ్చి తగ్గిన వారిలో చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మెదడుపై కూడా వైరస్ ప్రభావం చూపుతుందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

కరోనా మానసిక స్థితిపై కూడా కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు ఊపిరితిత్తులు, శ్వాసకోస, నరాలపై, గుండె , కిడ్నీలు తదితర భాగాలపై కోవిడ్ ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో మెదడు పై కూడా కరోనా ప్రభావం చూపుతున్నట్లు తేలింది. వైరస్ సోకి చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చిన వారిలో మానసిక రుగ్మతలు అథికంగా ఉంటున్నాయి. ప్రతి ఐదుగురిలో ఒకరికి మానసిక సమస్య తలెత్తుంది. అమెరికాలో కరోనా వచ్చి తగ్గిపోయినవారిపై 90 రోజుల్లో మెదడుపై ప్రభావం చూపుతున్నట్లు వెల్లడైంది.

కరోనా వచ్చి పోయిన వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మొన్నటివరకు దీర్ఘకాలిక వ్యాధులపై ప్రభావం చూపిన మహమ్మారి రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. కరోనా సోకి లక్షణాలు లేనివారికి కూడా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. కరోనాతో కోలుకున్నవారిలో యాంటీ బాడీలు కొద్దిరోజులపాటే ఉంటాయని, రెండోసారి కూడా వైరస్ సోకే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే న్యూట్రిషన్ ఆహారం తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనాపై జరుగుతున్న స్టడీల్లో రోజుకో కొత్తరకం ఆరోగ్య సమస్యలు వెలుగులోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తుంది.

Tags:    

Similar News