ఇతర దేశీయులకు హాని తలపెట్టమని ప్రపంచ దేశాలకు మాట ఇస్తున్నాం: తాలిబన్లు

* టాప్ చానల్ టోలో న్యూస్‌కు వచ్చిన తాలిబన్లు * టోలో న్యూస్ చానల్‌లో మహిళా యాంకర్‌కు తాలిబన్ ప్రతినిధి ఇంటర్య్వూ

Update: 2021-08-18 02:22 GMT

మహిళా యాంకర్‌కు తాలిబన్ ప్రతినిధి ఇంటర్య్వూ (ఫోటో: న్యూస్ వీక్)

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో జనం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. బయటకొస్తున్న వారిలో ఒకరిద్దరు మాత్రమే మహిళలు ఉన్నారు. ఒక వేళ మహిళలు బయటకు వస్తే వారి వెంట కుటుంబ సభ్యులు లేదంటే భర్త తప్పనిసరిగా ఉండాలనే తాలిబన్లు పెట్టిన నియమాన్ని పాటిస్తున్నారు. బుర్ఖా ధరించి మాత్రమే మహిళలు రోడ్లపైకి వస్తున్నారు. కొన్ని చోట్ల వ్యాపారులు ధైర్యం చేసి షాపులు తెరుస్తున్నారు. చాలా చోట్ల ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.

మరోవైపు టీవీ చానళ్లలో తాలిబన్ బోధనలు ప్రారంభం అయ్యాయి. నిన్న తెరమీదకు ఇద్దరు మహిళా యంకర్లు, మహిళా రిపోర్టర్లు కనిపించారు. టాప్ చానల్ టోలో న్యూస్‌కి తాలిబన్ల ప్రతినిధులు వచ్చారు. మహిళా యాంకర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 20 ఏళ్ల తర్వాత విదేశీ సైన్యాన్ని తరిమికొట్టామని తాలిబన్ల ప్రతినిధి ప్రకటించారు. అంతర్గతంగా, బయట నుంచి శత్రుత్వం కోరుకోవడం లేదన్నారు. మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వమని స్పష్టం చేశారు. కాబూల్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూస్తామన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఏ ఇతర దేశీయులకు హాని తలపెట్టమని ప్రపంచ దేశాలకు మాట ఇస్తున్నామని ప్రకటించారు. కాబూల్‌లోని రాయబార కార్యాలయాల భద్రత తమకు ముఖ్యమన్నారు. రాయబార కార్యాలయాలకు మా బలగాలతో భద్రత కల్పిస్తామన్నారు. 

Tags:    

Similar News