ఆర్టికల్ 370 రద్దు భారత్ అంతర్గత విషయమే.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Mahmood Qureshi: పాకిస్తాన్‌ ప్రభుత్వానికి పెద్ద షాక్ త‌గిలింది.

Update: 2021-05-08 16:15 GMT

 మహ్మూద్ ఖురేషి ఫైల్ ఫోటో  

Mahmood Qureshi: పాకిస్తాన్‌ ప్రభుత్వానికి పెద్ద షాక్ త‌గిలింది. కాశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు భారత్ అంతర్గత విషయమే నంటూ పాక్ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను కేంద్ర ప్రభుత్వం తొలగించడాన్ని ఆయన సమర్థించారు. అది పూర్తిగా భారత్ అంతర్గత విషయమని అన్నారు. అంతేకాకుండా ఈ విషయంపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేయడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. ఏకంగా విదేశాంగ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఇమ్రాన్ ప్రభుత్వం ఇరుకున పడ్డట్లైంది.

ఇటీవల పాక్‌లోని ప్రముఖ సమీ టీవీ ఛానల్‌లో ఇంటర్వ్యూ ఇస్తూ ఖురేషీ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన భారత్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. 2018లో 370 ఆర్టికల్ రద్దు సమయం నుంచి ఇమ్రాన్ ప్రభుత్వం భారత్‌ను ఈ విషయంలో వ్యతిరేకిస్తూనే ఉంది. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు భారత్-పాక్ సంబంధాలు పూర్వ స్థితికి చేరుకోవంటూ అప్పట్లో ఇమ్రాన్ తేల్చి చెప్పారు. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీకి చెందిన మంత్రి ఇలా చెప్పడం తీవ్ర చర్చకు దారితీసింది.

ఇక భారత్‌-పాక్‌ మధ్య ఇతర విషయాల్లో ఉన్న విభేదాలు కూడా కేవలం చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఖురేషీ అన్నారు. తాము యుద్ధాన్ని కాంక్షించమని, యుద్ధం ఎప్పుడూ ఆత్మహత్యా సదృశమని అందువల్ల ప్రతి విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే ఆశిస్తున్నామని అన్నారు.

Tags:    

Similar News