ఆర్మీ కాన్వాయ్‌పై దాడులు, 20 మంది సైనికుల మృతి

గురువారం సాయంత్రం రెండుచోట్ల సైనిక దళాల కాన్వాయ్‌పై దాడులు జరిగాయి. ఈ ఘటనలో 20 మంది సైనికులు మరణించారు..

Update: 2020-10-16 05:35 GMT

పాకిస్తాన్‌లో గురువారం సాయంత్రం రెండుచోట్ల సైనిక దళాల కాన్వాయ్‌పై దాడులు జరిగాయి. ఈ ఘటనలో 20 మంది సైనికులు మరణించారు. మొదటి దాడి ఉత్తర వజీరిస్తాన్‌లో, రెండవది ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలో జరిగింది. ఇరవై మంది అక్కడిక్కడే మరణించగా.. మరికొందరు గాయపడ్డారు.. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు.. దీనికి కారణం చాలా మంది సైనికుల పరిస్థితి క్లిష్టంగా ఉండటమే.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వాతో మాట్లాడారు.. అతని ద్వారా సంఘటన వివరాలు తెలుసుకున్నారు. రెండు సైనిక సంస్థలను కూడా అక్కడికి పంపించారు. బలూచిస్తాన్‌లో గత నెలల్లో పాకిస్తాన్ దళాలపై అనేక దాడులు జరిగాయి. అయితే, ఖైబర్ మరియు వజీరిస్తాన్లలో ఇటువంటి దాడులు కొత్తవి అని పాక్ అధికారులు అంటున్నారు.

ఇదిలావుంటే ఐదు నెలల్లో పాకిస్తాన్ సైనికుల కాన్వాయ్‌పై నాల్గవ దాడి ఇది. మొత్తం మీద 50 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గ్వాడార్ లో జరిగిన దాడి.. ప్రభుత్వం మరియు సైనికులకు ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ పాకిస్తాన్, చైనా సంయుక్తంగా ఓడరేవులను నిర్మిస్తున్నాయి. ఈ ప్రాంతం బలూచిస్తాన్ మరియు ఉత్తర వజీరిస్తాన్ సరిహద్దులో ఉంది.

Tags:    

Similar News