Kargil War: కార్గిల్ యుద్ధం పాకిస్తాన్ మిలటరీ పనే.. ఒప్పుకున్న పాకిస్తాన్ జనరల్ సయ్యద్ ఆసిం మునీర్

Pakistan Army Chief on Kargil War: కార్గిల్ యుద్ధంలో పాకిస్తానీ సైన్యం పాత్ర ఉందని తొలిసారిగా రావల్పిండిలోని ఆ దేశ సైనిక ప్రధాన కార్యాలయమైన జనరల్ హెడ్‌క్వార్టర్స్ (జీహెచ్‌క్యూ) వెల్లడించింది. పాకిస్తాన్ సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ సయ్యద్ ఆసిం మునీర్ 1999 నాటి కార్గిల్ యుద్ధంలో పాక్ మిలటరీ ప్రత్యక్ష పాత్ర ఉందని అంగీకరించారు.

Update: 2024-09-08 04:43 GMT

శుక్రవారం నాడు పాకిస్తాన్‌లో ఢిపెన్స్ డే సందర్భంగా ఇచ్చిన ప్రసంగంలో మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధం, ఇంకా భారత్‌తో జరిగిన మూడు యుద్ధాలలో ప్రాణ త్యాగం చేసిన పాకిస్తానీ సైనికులకు గౌరవ వందనం చేస్తున్నట్లు ప్రకటించారని ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

“పాకిస్తాన్ ఎంతో శక్తిమంతమైన, సాహసిక దేశం అనడంలో సందేహం లేదు. దేశ స్వాతంత్ర్యం విలువ ఏమిటో మన దేశానికి తెలుసు. 1948, 1965, 1971, కార్గిల్ యుద్ధం.. లేదంటే సియాచిన్ వంటి యుద్ధాలలో వేలాది మంది పాకిస్తాన్ సైనికులు దేశ భద్రత పరిరక్షణ కోసం ప్రాణ త్యాగం చేశారు” అని జనరల్ మునీర్ జీహెచ్‌క్యూ వద్ద చేసిన ప్రసంగంలో అన్నారు.

ఆయన ప్రకటన ఒక విధంగా కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం ప్రమేయం ఉందంటూ వచ్చిన తొలి అధికారిక ప్రకటనగా భావిస్తున్నారు. ఎందుకంటే, పాకిస్తాన్ అధికారికంగా ఈ విషయాన్ని గత 25 ఏళ్ళుగా అంగీకరించడానికి నిరాకరిస్తూ వచ్చింది. ఇప్పుడు మొదటిసారిగా పదవిలో ఆర్మీ చీఫ్ ఆ ప్రకటన చేయడంతో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం పాత్రను అధికారికంగా ఒప్పుకున్నట్లయింది. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో తమ సైన్యం ప్రమేయం లేదని, అది కశ్మీర్ జిహాదీలు చేసిన పోరాటమని పాకిస్తాన్ చెబుతూ వచ్చింది.

పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ పర్వేజ్ ముషరఫ్ అయితే, కార్గిల్ యుద్ధం కశ్మీర్ ప్రాంతంలోని స్థానికులు చేసిన పోరాటమనే చెప్పేవారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆయన పాకిస్తాన్ సైన్యం చాలా సందర్భాల్లో భారత సరిహద్దు ప్రాంతంలో చేపట్టిన చర్యలకు అప్పటి ప్రధాన నవాజ్ షరీఫ్‌కు కూడా సమాచారం ఉండేది కాదని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు ప్రస్తుత ఆర్మీ చీఫ్ తన డిఫెన్స్ డే ప్రసంగంలో కార్గిల్ యుద్ధంలో పాక్ సైన్యం ప్రత్యక్ష పాత్ర ఉన్నట్లు అంగీకరించారు.

Tags:    

Similar News