భారత్ పై బురద వేద్దామనుకొని బోర్లా పడ్డ పాక్.. ఐక్యరాజ్యసమితిలో భారీ షాక్..
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో పాకిస్థాన్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది..
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో పాకిస్థాన్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా మండలిలో భారత్‌పై పాకిస్తాన్ చేసిన మరో చర్యను తిరస్కరించింది. ఇద్దరు భారతీయులను ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ పాకిస్తాన్ చేసిన తీర్మానాన్ని భద్రతా మండలి తిరస్కరించింది. ఉగ్రవాదంపై మతపరమైన రంగును పులమడం ద్వారా 1267 ప్రత్యేక విధానాన్ని రాజకీయం చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి బుధవారం తెలిపారు. యుఎన్‌ఎస్‌సి యొక్క 1267 ఉగ్రవాద నిరోధక ఆంక్షల కమిటీ కింద అంగార అప్పాజీ, గోవింద పట్నాయక్ అనే ఇద్దరు భారతీయులను ఉగ్రవాద కార్యకర్తలుగా గుర్తించే చర్యను పాకిస్తాన్ ప్రారంభించింది..
అయితే ఈ ఆరోపణలకు మద్దతు ఇవ్వడానికి ఆధారాలు సమర్పించడంలో పాకిస్థాన్ విఫలమైన నేపథ్యంలో అమెరికా, యుకె, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం నేతృత్వంలోని యుఎన్‌ఎస్‌సి పాకిస్తాన్ చర్యను అడ్డుకోవాలని నిర్ణయించింది. ఉగ్రవాదంపై మతపరమైన రంగును పులమడం ద్వారా 1267 ప్రత్యేక విధానాన్ని రాజకీయం చేయటానికి పాకిస్తాన్ చేసిన విఫల ప్రయత్నాన్ని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అడ్డుకుందని.. ఈ పాకిస్తాన్ చర్యను అడ్డుకున్న కౌన్సిల్ సభ్యులందరికీ కృతజ్ఞతలు అని టిఎస్ తిరుమూర్తి ట్వీట్ చేశారు.