Oxford Corona Vaccine Early trial shows Positive Result: ప్రపంచానికి గొప్ప శుభవార్త చెప్పిన ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు

Oxford Corona Vaccine Early trial shows Positive Result: ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది.

Update: 2020-07-20 15:54 GMT
Oxford Vaccine Found to be 'Safe' in Early Trial, Shows Protective Immune Response in People.

Oxford Corona Vaccine Early trial shows Positive Result: ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. ఈ తరుణంలో యూకేలోనే ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు ప్రపంచానికి గొప్ప శుభవార్త చెప్పారు. ఆస్ట్రాజెనెక టీకా తయారీలో తొలి దశ విజయవంతమైందన్నారు. ఈ సందర్బంగా పేజ్-1 ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 23 నుంచి మే 21 వరకూ 1077 మంది వాలంటీర్లపై చేసిన క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయని పేర్కొన్నారు.

ఈ టీకా తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి పెరిగిందని.. ప్రజలలో సురక్షిత ప్రతిస్పందనను చూపించిందని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెప్పారు. దీనిపై సైన్స్ జర్నల్ ది లాన్సెట్ సంపాదకుడు రిచర్డ్ హోర్టన్ మాట్లాడుతూ.. ఈ టీకా "సురక్షితమైనది" మరియు "బాగా తట్టుకోగలది" అని తేలింది. సహచరులకు అభినందనలు. ఈ ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి" అని ఆయన ట్వీట్ చేశారు. కాగా ప్రపంచంలో ఇప్పటివరకు 16 మిలియన్ 40 వేల 349 మందికి కరోనావైరస్ సోకింది. అందులో 87 లక్షల 34 వేల 789 మంది నయమయ్యారు. 6 లక్షల 8 వేల 856 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా అమెరికా, బ్రెజిల్ లో ఎక్కువ కేసులు ఉన్నాయి. ఆ తరువాత స్థానాల్లో రష్యా, ఇండియా లాంటి పెద్ద దేశాలు ఉన్నాయి. 

Tags:    

Similar News