డెల్టాకంటే ఒమిక్రాన్‌దే పైచేయి.. సింగపూర్ నిపుణుల హెచ్చరిక
Omicron: ఆఫ్రికా మినహా అన్ని దేశాల్లో ఒమిక్రాన్ కేసులూ క్రమంగా పెరుగుతున్నాయి.
Omicron: ఆఫ్రికా మినహా అన్ని దేశాల్లో ఒమిక్రాన్ కేసులూ క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ 110 దేశాల్లో విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాతోపాటు బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియాల్లో ఒమిక్రాన్ కేసులే అత్యధికంగా నమోదవుతున్నాయి. వ్యాప్తి, పునరుత్పాదక శక్తీ ఒమిక్రాన్ వేరియంట్‌కు ఎక్కువని సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయ ఆస్పత్రికి చెందిన ప్రొఫెసర్ డేల్ ఫిషర్ చెప్పారు.
డెల్టా వేరియంట్‌లో 13 ఉత్పరివర్తనలు ఉంటే, వాటిలో 9 స్పైక్ ప్రోటీన్‌లోనే కనిపించాయి. ఒమిక్రాన్ వైరస్‌లో 50 ఉత్పరివర్తనలు ఉండగా, వాటిలో 32 స్పైక్ ప్రోటీన్‌లోనే చూడవచ్చు. వైరస్‌లు పరిణామం చెందే కొద్దీ వాటిలో పటిష్ఠమైనవి చివరివరకు నిలుస్తాయి. మరోవైపు టీకాలు, బూస్టర్ల వల్ల వ్యాధి తీవ్రం కాకుండా నిలువరించవచ్చు. ఆస్పత్రుల్లో చేరికలనూ నివారించవచ్చు.