సాధారణ చికిత్సతోనే ఒమిక్రాన్ నుంచి విముక్తి - డా. ఏంజెలిక్
Omicron - Dr Angelique Coetzee: ఒమిక్రాన్ చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపడం లేదు - ఏంజెలిక్
Omicron - Dr Angelique Coetzee: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు చెందిన వైద్య నిపుణురాలు, ఒమిక్రాన్‌ను మొదట గుర్తించిన డాక్టర్ ఏంజెలిక్ కాస్త ఉపశమనం కలిగించే వార్త వెల్లడించారు. తమ దేశంలోనే చాలా మంది సాధారణ చికిత్సతో ఈ వేరియంట్ నుంచి కోలుకుంటున్నట్లు తెలిపారు.
తక్కువ మోతాదులో కార్టిసోన్, ఐబూప్రొఫెన్ వంటి ఔషధాలతో కండరాల నొప్పి, తలనొప్పికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఒమిక్రాన్ బారిన పడినవారికి చాలా వరకు ఒళ్లు నొప్పులు, తలనొప్పి, అలసట వంటి లక్షణాలే కనిపించినట్లు వెల్లడించారు. కొందరికి మాత్రమే పొడి దగ్గు ఉందని వివరించారు. టీకా ఒక్క డోసు తీసుకున్నవారిలో ఈ వేరియంట్ లక్షణాలు స్వల్పంగానే కనిపించాయన్నారు.