అలయెన్స్ దూకుడుకు తోక ముడిచిన తాలిబన్లు.. తాలిబన్లను చీల్చి..
Afghanistan: ఆఫ‌్ఘనిస్తాన్ లో పౌరులకు, తాలిబన్లకు మధ్య ఘర్షణలు అంతర్యుద్ధం దిశగా అడుగులేస్తున్నాయి.
Afghanistan: ఆఫ‌్ఘనిస్తాన్ లో పౌరులకు, తాలిబన్లకు మధ్య ఘర్షణలు అంతర్యుద్ధం దిశగా అడుగులేస్తున్నాయి. ఆప్ఘన్ కేర్ టేకర్ అధ్యక్షుడు అమ్రుల్లా నేతత్వంలో నార్తరన్ అలయెన్స్ తాలిబన్లను చీల్చి చెండాడుతోంది. ఆఫ్ఘన్ పౌరులు మద్దతు పలకడంతో ఆఫ్గన్ ఆర్మీ దూకుడు పెంచింది. తాజాగా మూడు జిల్లాలను ఆప్ఘన్ సైన్యం తమ వశం చేసుకుంది. ఈ పోరులో అనేక మంది తాలిబన్లు చనిపోయినట్లు సమాచారం. తాలిబన్లను ఎదుర్కొనేందుకు దూకుడుగా పోరాడుతున్న నార్తరన్ అలయెన్స్ లో ఒకప్పుడు ఆప్ఘన్ ఆర్మీలో పని చేసిన వారంతా చేరారు. దాంతో ఈ కూటమి మరింత పటిష్టంగా, బలంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఆఫ్ఘన్ నేషనల్ డిఫెన్స్, సెక్యూరిటీ ఫోర్సెస్ లో పనిచేసిన వీరంతా శిక్షణలో రాటు దేలిన వారు పైగా అత్యాధునిక ఆయుధాల వినియోగంలో ఆరితేరిన వారు అమెరికా, నాటో సంకీర్ణ సేనల నేతృత్వంలో యుద్ధ రీతుల్లో తర్ఫీదు పొందిన వారు. తాలిబన్లను ఎంత మాత్రం అనుమతించబోమని ఆఫ‌్ఘన్ కోసం యుద్ధం కొనసాగుతుందని అమ్రుల్లా తేల్చిచెప్పారు.
తాలిబన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించరాదన్న పట్టుదలతో అమ్రుల్లా సలేహ్ నేతృత్వంలోని నార్తరన్ అలయెన్స్ అడుగులేస్తోంది. అధికారం చేజిక్కించుకుందామన్న తాలిబన్ల ఆతృత పై నీళ్లు చల్లుతోంది నార్తరన్ అలయెన్స్. గత కొన్ని రోజులుగా అమ్రుల్లా సేనలు పంజ్ హర్ లోయలో సాయుధ బలగాలతో కవాతు నిర్వహిస్తున్నాయి. పంజ్ షిర్ పై అమ్రుల్లాకు ఉన్న పట్టు కారణంగా తాలిబన్లు అక్కడ అడుగు పెట్టలేకపోతున్నారు. ఈ కారణంగా ఆప్ఘనిస్థాన్ లో అంతర్యుద్ధం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.