North Korea: బైడెన్ కు కిమ్ సోదరి స్ట్రాంగ్ వార్నింగ్

North Korea: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ సోదరి, ఆయన ప్రధాన సలహాదారు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

Update: 2021-03-16 15:57 GMT

బైడెన్ కు కిమ్ సోదరి స్ట్రాంగ్ వార్నింగ్

North Korea: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ సోదరి, ఆయన ప్రధాన సలహాదారు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దక్షిణ కొరియాతో అమెరికా సైనిక విన్యాసాలు చేపట్టడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మీరు వచ్చే నాలుగేళ్లు హాయిగా నిద్ర పోవాలనుకుంటే రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని బైడెన్‌ను హెచ్చరించారు. లేని పక్షంలో సైనిక ఉద్రిక్తతలు తగ్గించేలా 2018లో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని కూడా సమీక్షించాల్సి వస్తుందని కిమ్‌ సోదరి స్పష్టం చేశారు. పెంట‌గాన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్‌, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కలిసి మిత్ర దేశాలైన జ‌పాన్‌, దక్షిణ కొరియా పర్యటనను సోమవారం ప్రారంభించారు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఉత్తర కొరియా అధ్యక్షుడి సలహాదారు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తోంది.

Tags:    

Similar News