దుబాయ్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ముస్లిమేతర వ్యక్తులు ఈ పనిని సులువుగా చేసుకోవచ్చు..
Non-Muslims: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సోమవారం ముస్లిమేతరులకి గుడ్ న్యూస్ చెప్పింది
Non-Muslims: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సోమవారం ముస్లిమేతరులకి గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవడానికి అనుమతించింది. WAM నివేదిక ప్రకారం.. UAEలోని అబుదాబిలో నివసిస్తున్న ముస్లిమేతరులు ఇప్పుడు వారి మతం, ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవచ్చు. అంతేకాదు విడాకులు తీసుకోవచ్చు. పిల్లలను దత్తత కూడా చేసుకోవచ్చు. కొత్త పౌర చట్టంలో పితృత్వం, భరణం, ఉమ్మడి పిల్లల సంరక్షణ, వారసత్వం రుజువు కూడా ఉన్నాయి.
నివేదిక ప్రకారం అబుదాబికి చెందిన షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్-నహ్యాన్ కొత్త పౌర చట్టాలకు సంబంధించి ఒక డిక్రీని జారీ చేశారు. కొత్త సంవత్సరానికి ముందు ఇక్కడ నివసిస్తున్న ముస్లిమేతరులకు పెద్ద వార్తని తెలిపారు. నాన్ ముస్లిం కుటుంబ వ్యవహారాలను పరిష్కరించేందుకు కొత్త కోర్టును ఏర్పాటు చేయనున్నారు. దీనిని అబుదాబిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఈ కోర్టు అరబిక్‌తో పాటు ఇంగ్లీషు భాషలోనూ విచారణ జరుపుతుంది. కొత్త చట్టం ప్రకారం ముస్లిమేతరులకు హామీ ఇవ్వబడిన ప్రపంచ స్థాయి హక్కులను కల్పిస్తుంది. ఈ కొత్త పౌర చట్టం ముస్లిమేతర జనాభా కేసులను పర్యవేక్షిస్తుంది.
ఇతర దేశాలు చొరవ తీసుకోవచ్చు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముస్లిమేతరుల కోసం రూపొందించిన ఈ కొత్త పౌర చట్టాలను ప్రపంచం మొత్తానికి మార్గదర్శకంగా ఉన్నాయి. దీని మార్గంలోనే ప్రపంచంలోని ఇతర ఇస్లామిక్ దేశాలు కూడా ముస్లిమేతర పౌరుల కోసం చట్టాలు మార్చవచ్చు. దీని వల్ల అక్కడ నివసించే ముస్లిమేతర ప్రజలు తమ ఆచారాల ప్రకారం పనులు చేసుకోవచ్చు.