ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్.. సోకితే ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి..!

NeoCov COVID Variant: కరోనా అంతమవుతుందని ఓ వైపు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌-డబ్ల్యూహెచ్‌వో చెబుతుంటే మరోవైపు కొత్త వైరస్‌ వణికిస్తోంది.

Update: 2022-01-28 08:09 GMT

ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్.. సోకితే ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి..!

NeoCov COVID Variant: కరోనా అంతమవుతుందని ఓ వైపు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌-డబ్ల్యూహెచ్‌వో చెబుతుంటే మరోవైపు కొత్త వైరస్‌ వణికిస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌ను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ పుట్టిన దక్షిణాఫ్రికాలోనే నియోకోవ్‌ అనే ప్రమాదకర వేరియంట్‌ బయటపడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇదివరకటి వేరియంట్లతో పోల్చితే ఇది అత్యంత వేగంగా వ్యాపించడంతో పాటు ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కోత్త వేరియంట్‌ నియో కోవ్‌తో మరణాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్‌ జంతువుల నుంచి జంతువులకు మాత్రమే సోకుతున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2012-2015 మధ్యలో పాశ్యాత్య దేశాల్లో విజృంభించిన మర్స్‌-కోవ్ మాదిరిగానే నియో కోవ్‌ కూడా ప్రమాదకరమని చెబుతున్నారు. ఈ వైరస్‌ సోకితే ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి చెందే అవకాశం ఉందని చైనాలోని వ్యూహాన్‌ ల్యాబ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే నియో కోవ్‌ జంతులకు మాత్రమే సోకుతున్నదని.. ఇప్పటికిప్పుడు ఓ అంచనాకు రాలేమని రష్యా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనా శాస్త్రవేత్తల ఫలితాలను మరోసారి అధ్యయనం చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఐరోపా, అమెరికా దేశాలను వణికించింది. ఒమిక్రాన్‌ దెబ్బకు పలు దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. తాజాగాయూరప్‌, అమెరికాలో పాజిటివ్‌ కేసులు తగ్గుతుండడంతో.. ఇక కరోనా ఎండ్‌ అవుతుందని ఇటీవల డబ్ల్యూఎచ్‌వో ప్రకటించింది. తాజాగా నియో కోవ్‌ గుర్తించడంతో మళ్లీ ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News