New virus g-4 from china: డ్రాగన్ దేశంలో పుట్టిన కరోనా వైరస్ తో ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ వణికిపోతుంటే పరిశోధకులు మరో చేదు విషయాన్ని బయటపెట్టారు. అటు పరిశోధకులను, ఇటు ప్రజలను కలవర పెడుతున్న ఈ వైరస్‌కు జీ-4గా నామకరణం చేశారు. ఈ వైరస్ ఇదివరకే అంటే 2009లోనే ఒక్కసారిగా విజృంభించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అదే హెచ్1ఎన్1 వైరస్ ( స్వైన్ ఫ్లూ ). ఇప్పుడు ఈ జాతి నుంచే కొత్తగా వస్తున్న వైరస్ రూపాంతరం చెందుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కాగా ఈ వైరస్ కు మనుషులకు సోకడానికి గల అవసరమయ్యే అన్ని లక్షణాలన్నీ ఉన్నట్లు గుర్తించారని అని చైనీస్ విశ్వవిద్యాలయ మరియు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు వెల్లడిచేసారు.
ఇక ఈ వైరస్ గురించి 2011 నుంచి 2018 మధ్య చైనాలోని పది ప్రావిన్సుల్లో ఉన్న వివిధ జంతువధశాలలు, పశువైద్యశాలల్లో ఉన్న పందుల నుంచి దాదాపు 30వేల నమూనాలను సేకరించారు. ప్రస్తుతం కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో తీసుకుంటున్నట్లుగా నమూనాలను పందుల ముక్కుల్లో నుంచే తీసుకున్నారు. ఆ తరువాత వాటిపై పరిశోధనలు జరపి సుమారు 179 రకాల స్వైన్ ఫ్లూ వైరస్‌లను కనుగొన్నారు. వైరస్‌లు సోకినప్పుడు మనుషుల్లో కనబడే లక్షణాలే దాదాపు ఫెర్రెట్‌లోనూ కనిపిస్తుంటాయి. కొత్తగా కనుగొన్న వైరస్‌లన్నింటిలోకెల్లా జీ-4 వైరస్ ఫెర్రెట్‌లో ప్రమాదకర లక్షణాలు చూపినట్లు పరిశోధకులు గుర్తించారు.
ఇక ఈ వైరస్ పరిశ్రమల్లో పనిచేసే ప్రతి 10 మందిలో ఒకరికి సోకిందని అధ్యయనంలో తేలింది. వారిపై యాంటీబాడీ పరీక్షలు జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా వచ్చే ఫ్లూల వల్ల ఇప్పటికే మనుషుల్లో ఏర్పడ్డ రోగ నిరోధక శక్తి.. జీ-4 నుంచి కాపాడే అవకాశం లేదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మానవ అవసరాలను అనుగుణంగా జరుగుతున్న జంతు పోషణ వల్ల మనుషులకు నిరంతరం ముప్పు పొంచి ఉంటుందన్న విషయాన్ని తాజా అధ్యయనం నొక్కి చెబుతోందని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని పశువైద్య విభాగం అధిపతి జేమ్స్ వుడ్ అభిప్రాయపడ్డారు. మానవులు పొందే రోగనిరోధక శక్తి G4 నుండి రక్షణను అందించదని పరీక్షలు నిరూపించాయని వెల్లడి. చైనా లో సాధారణ జనాభాలో 4.4 శాతం మంది కూడా బయటపడినట్లు పరీక్షల్లో తేలింది.