కరోనా కొత్త స్ట్రెయిన్‌తో బ్రిటన్ అతలాకుతలం
* రోగులతో కిటకిటలాడుతున్న హాస్పిటల్స్ * కొత్త స్ట్రెయిన్ ప్రారంభమయ్యాక 41,385 కొత్త కేసులు నమోదు * జాతీయ నేషనల్ హెల్త్ సర్వీస్ ఆందోళన వ్యక్తం
కరోనా కొత్త స్ట్రెయిన్‌తో బ్రిటన్ అతలాకుతలమవుతోంది. వైరస్ వేగంగా ప్రబలడంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. కొత్త స్ట్రెయిన్ ప్రారంభమయ్యాక 41 వేల 385 కొత్త కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే దేశంలో ఆసుపత్రుల్లో 20 వేల 426 కేసులు నమోదయ్యాయి. గతంలో కరోనా కల్లోలం ప్రారంభమయ్యాక ఏప్రిల్ 12న రికార్డు స్థాయిలో 18,974 మంది చికిత్స పొందారు. ఆ తర్వాత ఇదే అత్యధికం. కొత్త స్ట్రెయిన్ ముప్పు మున్ముందు మరింత పొంచి ఉండడంతో చికిత్సలపై జాతీయ నేషనల్ హెల్త్ సర్వీస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.