South Africa New Variant: దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్
South Africa New Variant: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం
South Africa New Variant: దక్షిణాఫ్రికాలో గుర్తించిన కరోనా కొత్త వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. విదేశీ ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పకడ్బందీగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. వారికి కోవిడ్ పరీక్షలు కచ్చితంగా చేయాలని సూచించింది.
దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి వచ్చే వారిపై జాగ్రత్తగా వ్యవహరించాలన్న కేంద్రం రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖలు రాసింది. ప్రయాణికుల్లో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వెంటనే వారి శాంపిల్స్‌ని ల్యాబ్‌లకు పంపాలని సూచించింది. అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.