Nepal PM KP Sharma Oli on Lord Rama: రాముడిపై ప్రధాని ఓలి వ్యాఖ్యలు.. స్వదేశంలోనే విమర్శలు!
Nepal PM KP Sharma Oli on Lord Rama: హిందువుల పవిత్ర దైవం శ్రీరాముడి జన్మస్థలం పైన నేపాలీ ప్రధాని కె.పి.శర్మ ఓలి ఇటివల సంచలన వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా..
Nepal PM KP Sharma Oli on Lord Rama: హిందువుల పవిత్ర దైవం శ్రీరాముడి జన్మస్థలం పైన నేపాలీ ప్రధాని కె.పి.శర్మ ఓలి ఇటివల సంచలన వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా.. అయితే ఆయన వాఖ్యాల పైన భారత్ లోనే కాదు సొంత దేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓలి వాఖ్యాల పైన ఆ దేశ మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారాయ్ స్పందించారు. ఓలి హద్దుమీరి వ్యాఖ్యలు చేశారని, అంతేకాకుండా అయన కొత్తగా ఇప్పుడు కలియుగ రామాయణాన్ని వినిపిస్తారేమోనని అని ఎద్దవా చేశారు. ఇక అయన వాఖ్యలు భారత్-నేపాల్ మధ్య సంబంధాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి కమల్ థాపా అభిప్రాయపడ్డారు.
ఓలి వాఖ్యలు కేవలం నేపాల్ లోనే కాకుండా బయట దేశాలలో కూడా , రామభక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అయన వెంటనే తన వాఖ్యాలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ సీనియర్ నేత బామ్‌దేవ్ గౌతమ్ డిమాండ్ చేశారు. ఇక రాముని జన్మస్థలం అయిన అయోధ్య ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ నేతలు కూడా అయన పైన మండిపడుతున్నారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ నేపాల్ ఒకప్పుడు ఆర్యుల పాలనలో అంతర్భాగం అనే విషయం ఓలి తెలుసుకోవాలని పేర్కొన్నారు.
ప్రధాని పైన తీవ్ర విమర్శలు వస్తున్న నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం దిద్దిబాటు చర్యలను ప్రారంభించింది. ఓలీ వ్యాఖ్యల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం లేదని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రతి ఏటా సీతారాముల కళ్యాణాన్ని బిబహ పంచమి పేరుతో జనక్‌పూర్‌లో నిర్వహించే సంప్రదాయం కొనసాగుతుందని తెలిపింది.
అంతకుముందు నేపాలీ ప్రధాని కె.పి.శర్మ ఓలి ఇలా మాట్లాడారు.. శ్రీరాముడు, సీత ఇద్దరు నేపాలీ వారేనని అంటూ కామెంట్స్ చేశారు. శ్రీరాముడి జన్మస్థలం ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య కాదని, నేపాల్ లో ఉన్న అయోధ్య అని అన్నారు. నేపాల్‌లోని బీర్‌గంజ్ పశ్చిమాన ఉన్న చిన్నగ్రామమే అయోధ్య అని ప్రధాని నివాసంలో జరిగిన భానుభక్త ఆచార్య జయంతి కార్యక్రమంలో ఓలీ తెలిపారు.. ఈ వాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి.