Nepal Floods Landslides: నేపాల్‌లో వరద బీభత్సం..170కు చేరిన మృతుల సంఖ్య

Nepal floods death toll : నేపాల్‌లో కుండపోత వర్షాల తరువాత వరదలు, కొండచరియలు విరిగి పడి వందలాది మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 170 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొండచరియల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Update: 2024-09-30 03:43 GMT

Nepal Floods Landslides: నేపాల్‌లో వరద బీభత్సం..170కు చేరిన మృతుల సంఖ్య

Nepal Floods Landslides: భారీ వర్షాలను నేపాల్ ను అతలాకుతలం చేశాయి. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వీటి కింద చిక్కుకుని మరణించినవారి సంఖ్య 170కి చేరుకుంది. 42 మంది గల్లంతయినట్లు అధికారులు చెబుతున్నారు. శుక్రవారం నుంచి తూర్పు, మధ్య నేపాల్లోని పలు ప్రాంతాలన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా సంభవించిన వరదల వల్ల భారీగా ప్రాణనష్టం జరిగిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. నేపాల్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 170 మంది మరణించారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 42 మంది గల్లంతైనట్లు హోంశాఖ అధికారులు తెలిపారు.

వరదల కారణంగా 111 మంది గాయపడ్డారని హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రిషిరామ్ పోఖరేల్ తెలిపారు. అన్ని భద్రతా సంస్థల సహాయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయని పోఖారెల్ చెప్పారు. దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన 162 మందిని నేపాలీ సైన్యం విమానంలో తరలించిందని ఆయన చెప్పారు. నేపాలీ ఆర్మీ, నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు బలగాల సిబ్బంది వరదల్లో చిక్కుకున్న సుమారు 4,000 మందిని రక్షించారని పోఖారెల్ చెప్పారు. రక్షించిన ప్రజలకు పునరావాసం కల్పించడంతోపాటు ఆహారం, సామగ్రిని పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు.

కొండచరియలు విరిగిపడటంతో శనివారం నుంచి జాతీయ రహదారులు మూసుకుపోయాయని, వివిధ రహదారులపై వందలాది మంది ప్రజలు చిక్కుకుపోయారని అధికార తెలిపారు. వరదలు, కొండచరియలు విరిగిపడటం, నీటి ఎద్దడి కారణంగా రహదారులను మరమ్మత్తు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ఖాట్మండును ఇతర జిల్లాలతో కలిపే ప్రధాన భూమార్గమైన త్రిభువన్ హైవేపై ట్రాఫిక్ తిరిగి ప్రారంభమైందని ఆయన చెప్పారు. అధికారుల ప్రకారం, వరదల కారణంగా నేపాల్‌లో కనీసం 322 ఇళ్లు, 16 వంతెనలు దెబ్బతిన్నాయని తెలిపారు.

40-45 ఏళ్ల తర్వాత విధ్వంసం:

ఖాట్మండు లోయలో 40-45 ఏళ్లలో ఇంత వినాశకరమైన వరదలు తాము ఎప్పుడూ చూడలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఖాట్మండులో ఈ స్థాయిలో వరదలు రావడం ఇంతకు ముందెన్నడూ చూడలేదని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ (ICIMOD)లోని వాతావరణ, పర్యావరణ నిపుణుడు అరుణ్ భక్త శ్రేష్ఠ తెలిపారు. ఖాట్మండు సరిహద్దులోని ధాడింగ్ జిల్లాలో శనివారం బస్సు కొండచరియలు విరిగిపడటంతో కనీసం 19 మంది మరణించారని అధికారులు తెలిపారు. భక్తపూర్ నగరంలో కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలి ఐదుగురు మరణించారు. మక్వాన్‌పూర్‌లోని 'ఆల్ ఇండియా నేపాల్ అసోసియేషన్' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రంలో కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు ఫుట్‌బాల్ క్రీడాకారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

Tags:    

Similar News