విరిగిపడ్డ కొండచరియలు : 25 మంది గల్లంతు
నేపాల్‌లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సింధుపాల్‌చౌక్ జిల్లాలోని బర్హాబైస్ గ్రామీణ మునిసిపాలిటీ -7 లో..
నేపాల్‌లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సింధుపాల్‌చౌక్ జిల్లాలోని బర్హాబైస్ గ్రామీణ మునిసిపాలిటీ -7 లో భారీ వర్షలు కారణంగా నిన్న రాత్రి కొండ చరియలు విరిగిపడి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.. అంతేకాదు చాలామంది తప్పిపోయారు. జిల్లాలోని భీర్‌ఖర్కా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 20 నుంచి 25 మంది గల్లంతయినట్లు బర్హాబైస్ గ్రామీణ మునిసిపాలిటీ చైర్మన్ నిమ్ ఫిన్జో పేర్కొన్నారు. ఆస్తినష్టంపై సరైన సమాచారం లేదని చెప్పారు.
అలాగే తొమ్మిది ఇళ్ళు తీవ్రంగా ధ్వంసం అయ్యాయని వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నేపాల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ బృందం తోపాటు.. ఆర్మీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాల కింద గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శిధిలాల తోపాటు వర్షం ప్రభావం ఎక్కువగా ఉండటం వలన రెస్క్యూ సిబ్బంది గల్లంతైన వారిని రక్షించడానికి తీవ్ర ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది.