Nelson Mandela daughter dies: నెల్సన్ మండేలా కుమార్తె జిండ్జీ మండేలా కన్నుమూత!
Nelson Mandela daughter dies: నల్లజాతి సూరీడు, సౌతాఫ్రికా మాజీ ప్రెసిడెంట్ నెల్సన్ మండేలా కుమార్తె జిండ్జీ (59) తుదిశ్వాస విడిచారు.
Nelson Mandela daughter dies: నల్లజాతి సూరీడు, సౌతాఫ్రికా మాజీ ప్రెసిడెంట్ నెల్సన్ మండేలా కుమార్తె జిండ్జీ (59) తుదిశ్వాస విడిచారు. ఆమె మరణానికి కారణాలు ఇంకా తెలీలేదు స్థానిక మీడియా కథనం ప్రకారం ఆమె ఈరోజు (జూలై 13) జొహన్నెస్ బర్గ్ ఆసుపత్రిలో మరణించారు. డెన్మార్క్ లో దక్షిణాఫ్రికా రాయబారిగా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె మరణంతో సౌతాఫ్రిక అంతా విషాదం కమ్ముకుంది.
మండేలా గొంతుక!
నెల్సన్ మండేలా జైలు లో ఉన్నపుడు జిండ్జీ మండేలా బయట ఆయన గొంతులా వ్యవహరించారు. కారాగారం నుంచి నెల్సన్ మండేలా పంపిన సందేశాలను బహిరంగ సభల్లో నిప్పుల వర్షం లాంటి పదాలతో ఆమె చదవి వినిపించేవారు. ఈక్రమం లోనే జిండ్జీ
1985లో భారీ జన సమూహం మధ్య చేసిన ఒక ప్రసంగం చరిత్రలో నిల్చిపోయింది. ఆమెకు విపరీతమైన ప్రాచుర్యాన్ని తీసుకువచ్చింది. నాటి దక్షిణాఫ్రికా పాలకులు ఉద్యమాన్ని వదిలేయమని. అలా చేస్తే జైలు నుంచి విడుదల చేస్తామనీ, నెల్సన్ మండేలా కు రాయబారం పంపారు. ఆ విషయంపై అయన చెరశాల నుంచి పంపిన సందేశాన్ని ఉద్వేగంగా.. తీవ్రమైన స్వరంతో జిండ్జీ మండేలా లక్షలాది మంది ముందు ప్రసంగ రూపంలో వల్లె వేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా దక్షిణాఫ్రికన్ల దృష్టిలో పెద్ద నాయకురాలిగా మారిపోయారు. జిండ్జీ మండేలా నెల్సన్ మండేలా, విన్నీ మండేలా దంపతుల సంతానం. వర్నవివక్షపై నెల్సన్ మండేలా చేసిన పోరాటంలో ఆమె కూడా తల్లి విన్నీ మండేలా తో పాటు విరివిగా పాల్గొన్నారు.