సూర్యుడిపై ప్రయోగాల్లో కీలక ముందడుగు.. సూర్యుడిని ముద్దాడిని నాసా రోదసి నౌక

NASA: ఇంతకాలం అసాధ్యమని భావించిన దానిని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సుసాధ్యం చేసి, సరికొత్త చరిత్రను సృష్టించింది.

Update: 2021-12-15 12:36 GMT

సూర్యుడిపై ప్రయోగాల్లో కీలక ముందడుగు.. సూర్యుడిని ముద్దాడిని నాసా రోదసి నౌక

NASA: ఇంతకాలం అసాధ్యమని భావించిన దానిని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సుసాధ్యం చేసి, సరికొత్త చరిత్రను సృష్టించింది. దాదాపు 2 మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్ ఉష్ణోగ్రత ఉండే సూర్యుడి కరోనాను నాసా పంపిన పార్కర్ సోలార్ ప్రోబ్ ముద్దాడింది. ఓ రోదసీ నౌక సూర్యుడి ఉపరితల వాతావారణాన్ని తాకడం అంతరిక్ష ప్రయోగాల హిస్టరీలోనే ఇది తొలిసారి. తాజా విజయంతో సౌర శాస్త్ర విజ్ఞానంలో మానవాళికి గొప్ప ముందడుగు పడడంతో పాటు నాసా అద్భుత మైలురాయిను చేరుకునట్టయింది.

మరోవైపు ఈ విజయం సూర్యుడి గుట్టు విప్పేందుకు దోహదపడుతుందని నాసా పేర్కొంది. రెడ్ హాట్ స్టార్ గురించి చాలా కాలం నుంచి రహస్యంగా ఉన్న విషయాలు ఇప్పుడు బయటపడతాయంది. సూర్యుడి ఉష్ణోగ్రత 5వేల 500 డిగ్రీల ఫారన్‌హీట్ కాగా సూర్యుని బయటి వాతావరణం ఉష్ణోగ్రత 2 మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్ ఉంటుంది. దీనికి కారణం ఏమిటో ఇప్పటి వరకు తెలియదు. ఇటువంటి అంశాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందనే ఆశలు తాజాగా చిగురిస్తున్నాయి. అదేవిధంగా భూమిపై పవర్ గ్రిడ్స్, రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగించే సౌర గాలులు వంటివాటి గురించి కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుందని నాసా సైంటిస్టులు చెప్తున్నారు.

Tags:    

Similar News