Marsquakes: అంగారక గ్రహంపై భారీ ప్రకంపనలు

* రికార్డు చేసిన నాసా ఇన్ సైట్ ల్యాండర్ * సెప్టెంబరు 18న అంగారకుడిపై ప్రకంపనలు * దాదాపు 90 నిమిషాల పాటు కొనసాగిన వైనం

Update: 2021-09-25 14:51 GMT

అంగారక గ్రహంపై భారీ ప్రకంపనలు (ఫోటో: నాసా)

Marsquakes: అంగారక గ్రహంపై కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్న నాసా షాకింగ్ విషయాలు వెల్లడించింది. భూమిపైలానే అంగారక గ్రహంపైనా ప్రకంపనలు జరిగినట్టు తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలు నాసా ప్రయోగించిన ఇన్‌సైడ్ ల్యాండర్ భూమికి చేరవేసినట్లు తెలిపింది.

సెప్టెంబర్ 18న జరిగిన ప్రకంపనల తీవ్రత 4.2గా నమోదయినట్లు వెల్లడించింది. అంతేనా, నెల రోజుల గ్యాప్‌లోనే మూడు సార్లు అంగారకుడిపై భూమి కంపించినట్లు నాసా తెలిపింది. ఇదే సమయంలో భూమి ఉపరితలం కంటే అంగారకుడి ఉపరితలం చాలా పలుచన అని నాసా స్పష్టం చేసింది. అందుకే అక్కడ దాదాపు 90 నిమిషాల పాటు భూ ప్రకంపనలు జరిగినట్టు నాసా తెలిపింది.

Tags:    

Similar News