Narendra Modi: యూకేలోని గ్లాస్కోకు చేరుకున్న ప్రధాని మోడీ

* వాతావరణ మార్పులకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ * రెండు రోజుల పాటు గ్లాస్కోలో ఉండనున్న ప్రధాని

Update: 2021-11-01 05:05 GMT

యూకేలోని గ్లాస్కోకు చేరుకున్న ప్రధాని మోడీ(ఫైల్ ఫోటో)

Narendra Modi: వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి 26వ 'కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్'లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ యూకేలోని గ్లాస్కో చేరుకున్నారు. ప్రధాని విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్‌కు చేరుకోగా ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

రెండు రోజుల పాటు గ్లా్స్కోలోనే ప్రధాని ఉండనున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో మోడీ భేటీకానున్నారు. ఇక గ్లాస్కోలో ఆదివారం ఇంటిన్సివ్ కాన్ఫరెన్స్ ప్రారంభమం కాగా నవంబర్ 12 వరకు కొనసాగనుంది.

ఈ సమావేశంలో క్లైమెట్ జస్టిస్ సమస్య అంశంపై భారత్ లేవనెత్తే అవకాశం ఉంది. బ్రిటన్ అధ్యక్షతన ఈ సమ్మిత్ జరుగుతోంది. కాప్-26 సమావేశంలో 120 కంటే ఎక్కువ దేశాల నాయకులు పాల్గొంటారు. వాతావరణ మార్పులకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

Tags:    

Similar News