ఆప్ఘన్ బాధితుల తరలింపుకు ఆపరేషన్ దేవి శక్తిగా నామకరణం
* రానున్న రోజుల్లో మరింత మందిని తరలిస్తామన్న హరీందర్ సింగ్ * సీఏఏ వద్దన్న వారే ఇప్పడు డేట్ పొడిగించమంటున్నారన్న మంత్రి
Operation Devi Shakti: CAAను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారే ఇప్పుడు కటాఫ్ డేట్ ను పొడిగించమని కోరుతున్నారన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీపు పురీపొరుగున ఉన్న దేశాల్లో పరిణామాలు అందరినీ కలవర పరుస్తున్నాయని సీఏఏను ఒకప్పుడు వ్యతిరేకించిన వారే ఇప్పడు మద్దతు పలకడమే దీనికి నిదర్శనమని అన్నారు.
ఆప్ఘన్ నుంచి భారతీయులు, ఆఫ్ఘన్ శరణార్ధుల తరలింపు ప్రక్రియ వేగం పుంజుకుందని రోజుకు రెండు ప్రత్యేక విమానాలు పెట్టి వారందరినీ తరలిస్తున్నామన్నారు. ఆప్ఘన్ లో భారతీయులకు సిక్కు గురుద్వారాలు ఆశ్రయమిచ్చి ఆదుకుంటున్నాయన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకూ అన్ని విపత్కర పరిణామాల్లోనూ సిక్కు సోదరులు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. ఆప్ఘన్ నుంచి భారతీయులు, శరణార్ధుల తరలింపుకు ఆపరేషన్ దేవిశక్తి అని పేరు పెట్టామన్నారు.