MonkeyPox: ఆఫ్రికా దేశాల్లో 18 వేలకు చేరిన మంకీపాక్స్ కేసులు

MonkeyPox: ఒక్క వారంలోనే 12వందల కేసులు

Update: 2024-08-20 15:29 GMT

Mpox Scare: మంకీపాక్స్ పై అప్రమత్తం..కీలక మార్గదర్శకాలు జారీ చేసిన ఎయిమ్స్

MonkeyPox: ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ కేసుల సంఖ్య 18వేల 737కు చేరింది. ఒక్క వారంలోనే 1200 కేసులు నమోదైనట్లు ఆఫ్రికా సమాఖ్య ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మొత్తంగా 541 మరణాలు సంభవించాయి. ఆఫ్రికా ఖండంలో 96శాతం కేసులు, మరణాలు కాంగోలోనే నమోదయ్యాయి. 12 ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్‌ కేసుల్ని గుర్తించగా మరణాలరేటు 2.89శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో వైరస్‌ కట్టడికి తాము ఏర్పాటు చేసిన అత్యవసర కమిటీ సిఫార్సులను త్వరలోనే విడుదల చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇక మంకీపాక్స్ వైరస్ వ్యాప్తితో.. భారత్ అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తి నివారణకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులలో ఆరోగ్య విభాగాలను అప్రమత్తం చేసింది. రోగులను గుర్తించి, వారికి వైద్యం అందించేందుకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేస్తోంది. దిల్లీలో మూడు నోడల్​ ఆసుపత్రులను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News