పారిస్‌లో కుక్కకు మంకీపాక్స్‌

Paris: మనిషి ద్వారా కుక్కకు సోకినట్టు వైద్యులు వెల్లడి

Update: 2022-08-17 02:17 GMT

పారిస్‌లో కుక్కకు మంకీపాక్స్‌

Paris: మంకీపాక్స్‌ వైరస్‌ మనుషుల నుంచి జంతువులకు సోకుతున్నట్టు ఫ్రెంచ్‌ పరిశోధకులు గుర్తించారు. ఇద్దరు స్వలింగ సంపర్కుల నుంచి కుక్కకు సోకినట్టు మెడికల్ జర్నల్ ద లాన్సెట్ తెలిపింది. ఇద్దరు స్వలింగ సంపర్కులకు మంకీపాక్స్ లక్షణాలు కనిపించిన 12 రోజుల తరువాత.. వారి ఇంట్లో ఉన్న నాలుగేళ్ల ఇటాలియన్‌ గ్రేహోండ్‌ కుక్కలోనూ కనిపించాయి. ఆ కుక్కకు గతంలో ఎలాంటి అనారోగ్యం లేదు. వైరస్‌ పరీక్షల్లో దానికి పాజిటివ్‌ తేలింది. స్వలింగ సంపర్కుల్లో లాటినోకి చెందిన వ్యక్తికి స్కిన్‌ అల్సర్ ఉంది. అయితే అతడి వద్ద ఆ కుక్క పడుకోవడంతోనే వైరస్‌ సోకినట్టు గుర్తించారు. లాటినో వ్యక్తి, కుక్క నుంచి మంకీపాక్స్ డీఎన్‌ఏను సేకరించి.. పరీక్షించగా.. ఇద్దరికీ సోకింది ఒక్కటే వైరస్సేనని తేల్చారు. దీంతో వైరస్‌ మనిషి నుంచి కుక్క వ్యాపించినట్టు నిర్ధారించారు.

Tags:    

Similar News