Military Plane Crash: కుప్పకూలిన ఫిలిప్పీన్స్ సైనిక విమానం.. 17 మంది మృతి

Military Plane Crash: ఫిలిప్పీన్స్ లోని జోలో విమానాశ్రయంలో ఆదివారం ఉదయం సైనిక విమానం సి-130 హెర్క్యూలస్ కు ప్రమాదం

Update: 2021-07-04 10:31 GMT

ఫిలిప్పీన్స్ విమాన ప్రమాదం (ఫోటో : న్యూ స్ట్రైట్ టైమ్స్)

Philippines Plane Crash: ఫిలిప్పీన్స్ లోని జోలో విమానాశ్రయంలో ఆదివారం ఉదయం సైనిక విమానం సి-130 హెర్క్యూలస్ కు ప్రమాదం జరిగింది. 92 మంది సైనికులు ఉన్న ఈ విమానం రన్ వే పైకి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా వెల్లడించారు. ఈ ప్రమాదంలో 40 ప్రాణాలతో బయటపడగా, 17 మంది కూలిన వెంటనే అంటుకున్న మంటల్లో చిక్కుకొని తమ ప్రాణాలను కోల్పో యారు. ఉగ్రవాద కార్యకలాపాలపై యుద్ధం సాగించేందుకు సిద్ధమైన సైనికులను కోల్పోవడంతో ఆ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం గాయపడిన సైనికిలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మిండానావోలోని కాగయాన్ లో సైనిక శిక్షణ పూర్తి చేసుకున్న ఈ సైన్యం జోలో విమానాశ్రయానికి చేరుకొనే సమయంలో సాంకేతిక లోపంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. ఫిలిప్పీన్స్ లోని ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైన సైనికులకి ఇలా జరగడంతో ఆ దేశ ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు మృతులకి సంతాపం తెలిపారు. ఈ ఘటనకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News