Marriage Rules: ఆ దేశంలో ప్రతి అబ్బాయి రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే జైల్లో వేస్తారు..!

Marriage Rules: మన దేశంలో భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోవడం నేరం.

Update: 2022-08-24 11:51 GMT

Marriage Rules: ఆ దేశంలో ప్రతి అబ్బాయి రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే జైల్లో వేస్తారు..!

Marriage Rules: మన దేశంలో భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోవడం నేరం. ఒకవేళ మరో పెళ్లి చేసుకోవాల్సి వస్తే.. మొదటి భార్యకు విడాకులు ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఆమె తప్పకుండా అంగీకరించాల్సిందే. భార్య కూడా మరో స్త్రీతో భర్త సంబంధం పెట్టుకోవడం లేదంటే.. పెళ్లి చేసుకోవడాన్ని సహించదు దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఇలాంటి నిబంధనలే అమలవుతున్నాయి. కానీ ఆఫ్రికాలోని ఓ దేశంలో మాత్రం ఇందుకు విరుద్ధమైన చట్టం ఉంది ఆ దేశంలో ఓ వ్యక్తి తప్పనిసరి రెండు సార్లు వివాహం చేసుకోవాల్సిందే కాదని నిరాకరిస్తే కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. ఒకవేళ రెండో పెళ్లికి భార్య నిరాకరిస్తే ఆమెకు కూడా శిక్ష తప్పదు చాలా విచిత్రంగా ఉంది కదూ ఆ దేశం ఎక్కడుందో? రెండు పెళ్లిళ్లకు కారణాలు ఏంటో? ఈ స్టోరీలో చూసేద్దాం.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశానికి వేర్వురుగా వివాహ చట్టాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అన్ని చట్టాలు ఒక పెళ్లికి మాత్రమే అనుమతిస్తాయి. రెండో పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఉండాలి. లేదంటే ఆమె నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదు. కానీ ఆఫ్రికా ఖండంలోని ఎరిట్రియా దేశంలో మాత్రం విచిత్రమైన చట్టం ఉంది. ఇక్కడి చట్టం ప్రకారం పురుషుడు రెండు పెళ్లిళ్లు చేసుకోవడం తప్పనిసరి. అక్కడి పురుషులు సంతోషంగానైనా బాధతోనైనా గత్యంతరం లేక రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే. ఒకవేళ రెండో వివాహానికి నిరాకరిస్తే జైలు శిక్ష తప్పదు. ఏదో సాధారణ జైలు శిక్ష అనుకుంటే పప్పులో కాలేసినట్టే రెండో పెళ్లి వద్దనుకున్న వ్యక్తికి ఏకంగా జీవిత ఖైదు విధిస్తారు. పురుషుల సంగతి ఇలా ఉంటే స్రీలపైనా అక్కడ కఠిన చట్టాలు ఉన్నాయి. ఒకవేళ భర్త రెండో పెళ్లి భార్య ఆపలేదు. ఒకవేళ ఆపే ప్రయత్నం చేస్తే మాత్రం ఆమెకు కూడా శిక్ష తప్పదని ఎరిట్రియా చట్టాలు చెబుతున్నాయి మరి రెండో పెళ్లి ఆలోచన ఉన్నవారికి ఇదేదో చట్టం బాగుందే అనిపిస్తుంది కదూ కానీ ఎరిట్రియా పాలకులు ఇలాంటి కఠిన చట్టం తీసుకురావడం ఓ వ్యధ ఉంది కన్నీటి కథ ఉంది.

ఆఫ్రికా ఖండంలో పలు దేశాలు నిత్యం ఆందోళనలతో భగ్గుమంటున్నాయి. ఒకవైపు కరువుకాటకాలు మరోవైపు అంతర్యుద్దాలతో విలవిలలాడుతుంటాయి. ఎరిట్రియాకు కూడా అలాంటి కథే ఉంది ఎర్ర సముద్రం తీరంలోని ఎరిట్రియా జిబుటీ, ఇథియోపియా, సూడాన్‌ దేశాలతో సరిహద్దును పంచుకుంటోంది. అయితే ఎరిట్రియాపై ఇథియోపియా నిత్యం దాడులకు తెగబడుతోంది. వరుస యుద్ధాల కారణంగా అక్కడి పురుషులు భారీగా మరణిస్తున్నారు. దీంతో మహిళల సంఖ్య భారీగా పెరిగిపోయింది. 36 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో యుద్ధాల కారణంగా భర్తలను కోల్పోయిన మహిళల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. చిన్న వయస్సులోనే ఒంటరి మహిళలను ఆదుకోవడానికి చివరి వరకు వారి ఆలనా పాలనా చూసుకోవడానికి మరొకరి తోడు అవసరమని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగానే ప్రతి పురుషుడు రెండు పెళ్లిళ్లు తప్పనిసరి చేసుకోవాలని కఠిన చట్టాన్ని తెచ్చింది. ప్రస్తుతం జనాభాలో అయితే పురుషులకు సమానంగా స్త్రీల సంఖ్య ఉంది. అయినా అక్కడి ప్రభుత్వం మాత్రం చట్టాన్ని మార్చేందుకు అంగీకరించడం లేదు. ఎప్పుడు యుద్ధం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతోంది. అక్కడి ప్రజలు కూడా ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు. అందుకే ఈ చట్టంపై పెద్దగా వ్యతిరేకత లేదు.

ఒక్క పెళ్లి విషయమే కాదు. ఎరిట్రియాకు మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 1993లో స్వతంత్రం పొందిన ఈ దేశంలో ఇప్పటివరకు అక్కడ ఎన్నికలే జరగలేదు. ఒకే దేశం ఒకే పార్టీ అనే సిద్ధాంతం అక్కడ అమలవుతోంది. 1993 నుంచి ఆ దేశానికి ఇసాయస్‌ ఆఫ్వెర్కినే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరో ఆసక్తికరమైన విశేషమేమిటంటే ఎరిట్రియాకు అధికారిక భాష లేదు ఆ దేశ రాజ్యాంగం ప్రకారం అన్ని భాషలు సమానమే అయితే ఇక్కడ ఇంగ్లీష్‌తో పాటు టిగ్రిన్యా అనే భాషను ప్రజలు అధికంగా మాట్లాడుతారు. అయితే వలస పాలన కారణంగా ఇంగ్లిష్‌ను అధికారిక భాషగా గుర్తించేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరిస్తోంది. 1980 వరకు ఎరిట్రియా ఇటలీ ఆధీనంలో ఉంది. 1941లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఎరిట్రియాను బ్రిటన్‌ స్వాధీనం చేసుకుంది. ఎర్ర సముద్రాన్ని గ్రీకులో ఎరిట్రియా అంటారు. ఇటాలియన్‌ కాలనీగా ఉన్న సమయంలో ఈ ప్రాంతానికి ఎరిట్రియా పేరును ఖరారు చేసింది. అప్పటి నుంచి అదే పేరుతో ఈ దేశాన్ని పిలుస్తున్నారు.

ఎరిట్రియా ప్రజలు బ్రిటన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దేశంలో స్వతంత్ర పోరాటం ఊపందుకుంది. ఇందులో మహిళలు చురుకైన పాత్ర పోషించారు. ఆ దేశంలో 30 శాతానికి పైగా మహిళలు స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. అయితే 1993లో బ్రిటన్‌ వలస పాలనకు ముగింపు పలికిన తరువాత ఇథోపియాతో నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పురుషుల సంఖ్య భారీగా పడిపోయింది. దీంతో జనాభాను పెంచేందుకు అక్కడి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. విదేశీయులకు ఎరిట్రియా పౌరసత్వం చాలా సులభంగా లభిస్తుంది. ఆ దేశంలో ఏదో ఒక ప్రాంతంలో పెట్టుబడులు పెడితే చాలని ఎలాంటి షరతులు ఉండవని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. పెట్టుబడులతో స్థానికంగా అభివృద్ధి చెందడంతో పాటు జనాభా పెరుగుతోందని ఈ నియమాన్ని పెట్టినట్టు ఎరిట్రియా ప్రభుత్వం చెబుతోంది.

అయితే పురుషులు రెండు పెళ్లిళ్లు తప్పని సరి చేసుకోవాలని ఎరిట్రియా ప్రభుత్వ చట్టంతో కెన్యాకు చెందిన పురుషులు పండగ చేసుకుంటున్నారు. ఎంచక్కా తమ దేశం వదలివచ్చి ఇక్కడి పౌరసత్వం తీసుకుని రెండు పెళ్లిళ్లు చేసుకుని జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తుండడం విశేషం.

Full View


Tags:    

Similar News