మేకప్ లేకుండా మిస్ ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరిన మెలిసా రవూఫ్
Miss England: మిస్ ఇంగ్లాండ్ చరిత్రలో మెలిసా రవూఫ్ అరుదైన రికార్డు
Miss England: అందాల పోటీలు అంటేనే మేకప్పుల తళుకులు, మెరుపులు ఉంటాయి. ఫుల్ మేకప్ ఉంటేనే కిరీటం సొంతం అవుతుందనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది ఇంగ్లాండ్ కు ఓ మోడల్. ఎలాంటి మేకప్ లేకుండా మిస్ ఇంగ్లాండ్ పోటీల్లో పాల్గొని ఫైనల్ కు చేరింది.
లండన్‌కు చెందిన మెలిసా రవూఫ్ మిస్ ఇంగ్లాండ్ పోటీల్లో మేకప్ లేకుండా పాల్గొని ఫైనల్‌కు చేరింది. అగస్ట్ 22న జరిగిన సెమీ ఫైనల్లో మేకప్ లేకుండా స్టేజీపైకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. 94ఏళ్ల మిస్ ఇంగ్లాండ్ పోటీల చరిత్రలో ఇలా మేకప్ లేకుండా పాల్గొన్న తొలి మోడల్‌గా అరుదైన రికార్డు సాధించింది. యువతులు తమ అందంపట్ల ఎలాంటి ఆత్మనూన్యత భావం లేకుండా ఉండాలనే సందేశం ఇవ్వడానికే మేకప్ లేకుండా పోటీల్లో పాల్గొన్నానని మెలిసా తెలిపింది. నిజమైన అందం సింప్లిసిటీలో ఉందని.. నిత్యం నవ్వుతూ సంతోషంగా ఉంటే వారు తమ ముఖాన్ని కప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది.
పొలిటికల్ సైన్స్ చదువుతోన్న మెలిస్సా అందాల పోటీలకు సరిపడా ఉండే ప్రమాణాలు తనలో ఉన్నాయని ఎప్పుడు అనుకోలేదని చెప్పింది. మేకప్ లేకుండా ఆమె ఫైనల్ చేరడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్టోబర్ లో జరగనున్న ఫైనల్లో కూడా మెలిసా ఎలాంటి మేకప్ లేకుండానే పాల్గొననుంది. దీంతో నెటిజన్స్ అంతా ఆమెకు బెస్టాఫ్ లక్ చెబుతున్నారు.