Washed Bundles of Currency Notes: నోట్ల కట్టలను ఉతికి ఆరేశాడు.. రూ. 14 లక్షలకు మిగిలింది మూడే...

Washed Bundles of Currency Notes: కరోనా విలయం ఎవరిని ఏ పని చేయిస్తుందో చెప్పలేని పరిస్థితి వచ్చింది. గతంలో మాదిరి కాకుండా సోషన్ మీడియా, యూట్యూబ్ లల్లో విస్తారంగా దీని జాగ్రత్తల గురించి అతిగా ప్రచారం.

Update: 2020-08-06 02:15 GMT
Washed Bundles of Currency Notes

Washed Bundles of Currency Notes: కరోనా విలయం ఎవరిని ఏ పని చేయిస్తుందో చెప్పలేని పరిస్థితి వచ్చింది. గతంలో మాదిరి కాకుండా సోషన్ మీడియా, యూట్యూబ్ లల్లో విస్తారంగా దీని జాగ్రత్తల గురించి అతిగా ప్రచారం జరుగుతుండటంతో ఏవరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే క్రమంలో తాజాగా ఒక వ్యక్తి రూ. 14 లక్షల కరెన్సీని ఉతికేయడమే కాదు.. ఏకంగా అరబెట్టడం వల్ల అవి కాలిపోయి దర్శనమివ్వడంతో గగ్గోలు పెడుతున్నాడు.

అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు.. కొరోనా దెబ్బకు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రతిఒక్కరు కొత్త పుంతలు తొక్కుతున్నారు.. 24గంటలు శానిటైజర్లతో చేతులు రుద్దుకోవడం, N95 మాస్కులతో ముక్కులు మూసుకోవడం.. అయినదానికి కాని దానికి అతి జాగ్రత్తలతో ఆవేశపడుతున్నారు.. వీళ్లందరిని తలదన్నే పని చేశాడు మరొకడు.. అసలు విషయం ఏంటంటే..

కరెన్సితో కొరోనా వస్తుంది అనే మాటవినగానే జాగ్రత్త పడడంలో అర్దం ఉంది, కానీ దుబాయ్ లోని సిలోన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఏకంగా తన దగ్గర డబ్బులను ఉతికాడు.. ఉతికితే ఉతికాడు ఆరేయడానికి ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో న బూతో న భవిష్యత్… తన దగ్గర ఉన్న 14లక్షల రూ.నోట్ల కట్టల్ని తీసుకెళ్లి వాషింగ్ మెషిన్లో వేసాడు.. ఉతకడం అయ్యాక తడిగా ఉన్న నోట్లని ఆరబెట్టడానికి ఓవెన్ లో పెట్టాడు..వావ్ వారెవ్వా ఏం తెలివి కదా..

హమ్మయ్యా, ఆరి ఉంటాయి అని ఓవెన్ ఓపెన్ చేసి చూస్తే మనోడికి నోట్ల ప్లేసులో, సగం కాలిన నోట్లు, బూడిద మిగిలింది.. లబో దిబో మంటూ ఆ సగం కాలిన నోట్లన్నింటిని పట్టుకుని బ్యాంక్ కి వెళ్లాడు.. మనోడి తెలివికి బ్యాంక్ వాళ్లు నోరెళ్లబెట్టారు.. కాలిపోయిన నోట్లకు డబ్బులు ఇవ్వలేం అంటూ తెగేసి చెప్పారు.. బాబ్బాబు, అలా అనకండి ఏదో ఒకటి చేయండి అని కాళ్లావేళ్లా పడితే.. నోట్లపై కనిపంచిన నంబర్ల ఆధారంగా కొన్ని నోట్లను ట్రేసవుట్ చేసారు..


14లక్షల్లో మనోడికి 3లక్షల చిల్లర మిగిలింది..దొరికిందే పదివేలు అని కళ్లకద్దుకుని బ్యాంక్ నుండి ఎంచక్కా పోయాడు.. అసలు కథ ఇప్పుడే మొదలైంది.. దక్షిణ కొరియాలో ఇదొక్క కేసే కాదు. ఇలాంటి కేసులు మరికొన్ని వెలుగులోకి వచ్చాయట. అందరూ బ్యాంకులకు క్యూ కట్టారు.. ఇప్పుడు ఈ కాలిపోయిన నోట్లను ఏం చేయాలా అని బ్యాంక్లు తలపట్టుకున్నాయి..

Tags:    

Similar News