Kulbushan Jadhav Plea Against his Death Sentence: కులభూషణ్ జాదవ్ విషయంలో పాక్ అతి తెలివి.. ఉరి వేయించడానికేనా?

Kulbushan Jadhav Plea Against his Death Sentence: కులభూషణ్ జాదవ్ విషయంలో పాకిస్తాన్ అతి తెలివి ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయ న్యాయస్థానం.

Update: 2020-07-08 11:00 GMT
Kulbushan Jadhav (File Photo)

Kulbushan Jadhav Plea Against his Death Sentence: కులభూషణ్ జాదవ్ విషయంలో పాకిస్తాన్ అతి తెలివి ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయ న్యాయస్థానం.. జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ కల్పించాలని, అతని మరణశిక్షను సమీక్షించాలన్న తీర్పునకు వ్యతిరేకంగా కుట్ర చేస్తోంది.. మరణశిక్ష సమీక్ష పిటిషన్ దాఖలు చేయడానికి నిరాకరించారని.. క్షమాబిక్ష పిటిషన్ కే కట్టుబడి ఉండాలని కులభూషణ్ జాదవ్ చెప్పినట్టు పాకిస్తాన్ అదనపు అటార్నీ జనరల్ అహ్మద్ ఇర్ఫాన్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సమీక్ష పిటిషన్ విషయంలో కుల్‌భూషణ్ జాదవ్‌కు మరో అవకాశం ఇచ్చినట్లు పాకిస్తాన్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. వాస్తవానికి గత జూలైలో, అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) పాకిస్తాన్‌ను జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ కల్పించి, మరణశిక్షను సమీక్షించాలని ఆదేసించింది.

ఈ క్రమంలో జూన్ 17, 2020 న, కులభూషణ్ జాదవ్ తన ఉరిశిక్షపై సమీక్ష పిటిషన్ దాఖలు చేయమని కోరినప్పటికీ.. పిటిషన్ దాఖలు చేయడానికి నిరాకరించాడని.. బదులుగా పెండింగ్ లో ఉన్న క్షమాబిక్ష పిటిషన్ కు కట్టుబడి ఉండాలని జాదవ్ నిర్ణయించుకున్నట్టు తెలిపింది. అయితే ఇందులో కుట్ర కోణం దాగి ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరణశిక్షపై కుల్‌భూషణ్.. సమీక్ష పిటిషన్ కాకుండా, క్షమాభిక్ష పిటిషన్ కోరుతున్నారు అంటే.. ఆయన తన తప్పును అంగీకరించినట్టుగా అంతర్జాతీయ న్యాయస్థానానికి తెలియజేయాలని.. ఇందులో ఆయనను దోషిగా చూపించి ఉరిశిక్ష అమలు చేయాలనే కుట్రకు పాక్ ప్రభుత్వం తెరలేపినట్టు అర్ధమవుతుందంటున్నారు. కాగా భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ 2016లో పాకిస్థాన్‌ భద్రతా దళాలకు దొరికారు. అయితే ఆయనపై గూఢచర్యం ఆరోపణలతో పలు కేసులు బనాయించారు.

Tags:    

Similar News