Kulbhushan Jadhav Case Updates: ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించిన పాక్..
Kulbhushan Jadhav Case Updates: కుల్భూషణ్ జాదవ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించింది.
Kulbhushan Jadhav Case Updates: కుల్భూషణ్ జాదవ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. కుల్భూషణ్ జాదవ్‌కు న్యాయవాదిని ఇవ్వాలని పాకిస్తాన్ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ కేసుపై న్యాయమైన విచారణ కోసం అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) ఇచ్చిన నిర్ణయాన్ని అమలు చేయడానికి పాకిస్తాన్ ఈ చర్య తీసుకుందని ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది.
పిటిషన్‌ను న్యాయ మంత్రిత్వ శాఖ దాఖలు చేసింది. ఇందులో అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, కులభూషణ్ జాదవ్.. మిలిటరీ కోర్టు నిర్ణయాన్ని సమీక్షించడానికి ఒక న్యాయవాదిని పొందాలని కోరినట్టు పేర్కొంది. కాగా పాకిస్తాన్ ఇటీవలే కుల్భూషణ్ జాదవ్ కేసులో మూడవ కాన్సులర్ యాక్సెస్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. అంతకుముందు, రెండవ కాన్సులర్ యాక్సెస్ తరువాత, భారత దేశం ఓ ప్రకటనలో అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పును పాకిస్థాన్ ఉల్లంఘించిందని ఆరోపించింది. అడ్డంకులు, అంతరాయాలు లేకుండా, బేషరతుగా జాదవ్‌ను కలిసేందుకు అవకాశం కల్పించలేదని ఆరోపించింది. అంతేకాదు జాదవ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కూడా పేర్కొంది.
కుల్భూషణ్ జాదవ్.. భారత గూడచారి అని పాకిస్తాన్ అరిపించి.. 2016 లో బలూచిస్తాన్ లో ఆయనను అరెస్ట్ చేసింది. అయితే అప్పటినుంచీ జాదవ్‌ను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసినట్లు భారత్ చెబుతోంది. అయితే 2017 లో పాకిస్తాన్ సైనిక కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించింది. భారత్ ఐసిజెకి వెల్ళడంతో జాదవ్ మరణశిక్షను సమీక్షించాలని పాకిస్థాన్ కు అంతర్జాతియ న్యాయస్థానం సూచించింది. ఇందులో భాగంగా జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.