జో బైడెన్ మాటల వెనుక కరీంనగర్ వినయ్ రెడ్డి!

మరికొన్ని గంటల్లో అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణాస్వీకారం చేయనున్నారు.

Update: 2021-01-20 12:21 GMT

 జో బైడెన్‌కు స్పీచ్‌ రైటింగ్‌ డైరెక్టర్‌గా వినయ్ రెడ్డి

మరికొన్ని గంటల్లో అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణాస్వీకారం చేయనున్నారు. 77ఏళ్ల వయసులో జో బైడెన్ వైట్ హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఆయన తోపాటు ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ కూడా ప్రమాణం చేయనున్నారు. బైడెన్ టీమ్ లో భారతీయులు కూడా ఉన్నారు. అయితే తెలుగు ప్రజలు గర్వించదగిన పరిణామం కూడా ఒకటి ఉంది.

బైడెన్ బృందంలో తెలంగాణ వాసి కూడా ఒకరు ఉన్నారు. తెలుగు వ్యక్తికి అరుదైన స్థానం దక్కింది. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చొల్లేటి వినయ్‌రెడ్డి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్పీచ్‌ డైరెక్టర్ల బృందంలో ఒకరిగా నియమితులయ్యారు. వినయ్‌రెడ్డి తండ్రి నారాయణరెడ్డి వృత్తిరీత్యా డాక్టర్‌. 40 ఏళ్ల కింద అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. వినయ్‌రెడ్డి అమెరికాలోనే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆంగ్లంపై మంచి పట్టు ఉండడంతో బైడెన్‌ స్పీచ్‌ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు.

వినయ్ రెడ్డి తండ్రి అమెరికాలో ఉన్నప్పటికీ సొంతూరికి వచ్చి వెళ్తుంటారు. వినయ్‌రెడ్డి తండ్రికి పోతిరెడ్డిపేట గ్రామంలో ఇల్లు, వ్యవసాయ భూమి ఉంది. వినయ్‌రెడ్డికి బైడెన్‌ బృందంలో చోటు దక్కినందుకు చొల్లేటి వినయ్‌రెడ్డి తాత తిరుపతిరెడ్డి పోతిరెడ్డిపేట గ్రామానికి 30 ఏళ్ల పాటు సర్పంచ్‌గా సేవలందించారు. పోతిరెడ్డిపేట గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News