Baby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సంచలన నిర్ణయం
Johnson and Johnson: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ 2023 తర్వాత కనిపించదు.
Johnson and Johnson: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ 2023 తర్వాత కనిపించదు. ఈ ఉత్పత్తిని 2023లో నిలిపివేయాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. దీని స్థానంలో కార్న్ స్టార్చ్ తో చేసిన పౌడర్ ను ప్రవేశపెట్టనుంది. జాన్సన్ అండ్ జాన్సన్ తాను విక్రయించే బేబీ టాల్కమ్ పౌడర్ కారణంగా వినియోగదారుల నుంచి సుమారు 38 వేల కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందులోని పదార్థం ఓవేరియన్ కేన్సర్ కు దారి తీస్తున్నట్టు పలువురు మహిళలు కోర్టుకెక్కారు. దీంతో ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో కార్న్ స్టార్చ్ పౌడర్ ను విక్రయిస్తున్నట్టు పేర్కొంది.