జార్జియాలో గెలుపు దిశగా జో బైడెన్‌..

అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ ఇంకా వీడట్లేదు. ఐదు రాష్ట్రాల్లో లెక్కింపు కొనసాగుతుండటం.. అభ్యర్థులిద్దరి మధ్య పెద్దగా తేడా లేకపోవడంతో పోరు మరింత రసవత్తరంగా మారుతోంది.

Update: 2020-11-06 12:28 GMT

అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ ఇంకా వీడట్లేదు. ఐదు రాష్ట్రాల్లో లెక్కింపు కొనసాగుతుండటం.. అభ్యర్థులిద్దరి మధ్య పెద్దగా తేడా లేకపోవడంతో పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. ఇక లెక్కింపు జరుగుతున్న రాష్ట్రాల్లో జార్జియా ప్రస్తుతం కీలకంగా మారింది. అక్కడ అభ్యర్ధుల మధ్య గెలుపు దోబూచులాడుతోంది. ఇప్పటివరకు ట్రంప్ ఆధిక్యంలో ఉండగా.. తాజాగా బైడెన్‌ దూసుకొచ్చారు. మరోవైపు సెనెట్‌లో బైడెన్‌ భవిత్యవం కూడా జార్జియా ఫలితంపైనే ఆధారపడటంతో ఇప్పుడు అందరిచూపు ఆరాష్ట్రంపైనే పడింది.

ఒకప్పుడు రిపబ్లికన్లకు మంచి పట్టున్న జార్జియాలో ఇటీవల పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఈ ఎన్నికల్లో అది స్పష్టంగా కనబడుతోంది. ఇక ఈ రాష్ట్రంలో 16 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. అటు బైడెన్‌ కూడా 917 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. ఒకవేళ ఆయన గెలిస్తే 16 ఎలక్టోరల్‌ ఓట్లు ఆయనకే పడతాయి. ఇక జార్జీయాలో ఓడిపోయి మిగితా నాలుగింటిలో గెలిచినా ట్రంప్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ను అందుకోలేరు.

ఇక ఫలితంరాని మిగితా నాలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల ట్రంప్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పెన్సిల్వేనియా, అలస్కా, నార్త్‌ కరోలినాలో ట్రంప్ ముందంజలో ఉండగా.. నెవడాలో మాత్రం బైడెన్‌ దూసుకెళ్తున్నారు. జార్జియా, నెవాడా డెమొక్రాట్ల వశమైతే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ గెలుపు ఖాయమైనట్లే..

Tags:    

Similar News