బైడెన్.. గెలిచేన్.. సంబరాల్లో అమెరికా..ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ ఘన విజయం సాధించారు. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి బాగా పోద్దుపోయాకా ఆయన విజయాన్ని అధికారికంగా ప్రకటించారు.
జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో చివరికి విజయం బిడెన్ ను వరించింది. ఎన్నికల్లో నాదే గెలుపు అంటూ వచ్చిన డోనాల్డ్ ట్రంప్ ఓట్ల వేటలో బైడెన్ కు చాలాదూరంలో ఆగిపోయారు. బైడెన్ గెలిచినట్టు ప్రకటన వెలువడిన వెంటనే అమెరికా అంతా సంబరాల వాతావరణం నెలకొంది. ఇక జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిన తరువాత ప్రపంచమంతా ఆయనకు అభినందనల సందేశాల్ని పంపుతూ వస్తోంది.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం.. ఎన్నో ఏళ్ల కల చివరకు ఇప్పుడు నెరవేరింది బైడేన్(77)కు. అమెరికా రాజకీయాల్లో మొదటి మెట్టైన సెనేటర్ పదవికి అతి పిన్న వయస్కునిగా ఎన్నికైన జో బైడెన్ ఇప్పుడు అతి పెద్ద వయస్కుడైన అమెరిగా అధ్యక్షునిగా రికార్డు సృష్టించారు. ఆరుసార్లు సెనేటర్ గా ఎన్నికైన అయన రెండుసార్లు (1988, 2008) అధ్యక్షా పదవి కోసం ప్రయత్నించినా.. స్వంత డెమోక్రటిక్ పార్టీలోనే మద్దతు సాధించలేక పోయారు. ఇప్పుడు మూడోసారి చేసిన ప్రయత్నంలో ఆయన ఘన విజయం సాధించి తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. బరాక్ ఒబామా అధ్యక్షునిగా ఉన్న సమయంలో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా రెండుసార్లు సేవలందించారు.
మధ్యతరగతి నుంచి అమెరికా అధ్యక్షునిగా.. జో బైడెన్ ప్రస్థానం ఇదీ..
► జో బైడెన్ 1942లో పెన్సిల్వేనియాలో ఓ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయన అసలు పేరు జో రాబినెట్ బైడెన్ జూనియర్.
► యూనివర్సిటీ ఆఫ్ డెలావర్‌లో చదివారు.
► 1968లో సైరకాస్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు.
► మొదటిసారిగా 1972లో డెలావర్ రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికయ్యారు. అప్పుడాయన వయసు 29 సంవత్సరాలు.
► దేశంలో పిన్నవయసు్కడైన సెనేటర్‌గా గుర్తింపు పొందారు.
► సెనేట్‌లో అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన సెనేటర్‌గా కూడా ఆయన అప్పట్లో పేరుగాంచారు.
► 1972లో జరిగిన కారు ప్రమాదంలో బైడెన్ మొదటి భార్య, 13 నెలల వారి కుమార్తె నవోమీ మరణించారు.
► బైడెన్ 1977లో జిల్ జాకబ్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు.
► వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు జని్మంచారు. ఒక కుమారుడు బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించాడు.